ఫోటోలుసినిమా వార్తలు

మొత్తానికి మూడు ముళ్లతో ఒక్కటైన విజయ్ – రష్మిక.. నెట్టింట వైరల్ అవుతున్న విరోష్ వెడ్డింగ్ పిక్స్!

ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరపడింది! సౌత్ ఇండియా మోస్ట్ క్రేజీ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఎట్టకేలకు ఒకటయ్యారు. గత కొన్నాళ్లుగా వస్తున్న రూమర్లన్నింటికీ చెక్ పెడుతూ, గురువారం ఉదయం 10:10 గంటలకు రష్మిక మెడలో విజయ్ మూడు ముళ్లు వేశారు. ఈ వెడ్డింగ్ ఫొటోలు బయటకు రాగానే సర్వత్రా ప్రకంపనలు మొదలయ్యాయి. అసలు ఆ ఫొటోల్లో ఏముంది? వారు ఒకరి గురించి ఒకరు ఏం చెప్పుకున్నారో తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే!

పవిత్ర బంధం షురూ!

గురువారం ఉదయం సరిగ్గా 10:10 నిమిషాలకు విజయ్ దేవరకొండ, రష్మిక మెడలో మూడు ముళ్లు వేస్తున్న అద్భుత దృశ్యం. రష్మిక మొహంలో వెలిగిపోతున్న ఆనందం చూస్తుంటే.. ఎన్నో ఏళ్ల కల నెరవేరినట్టు అనిపిస్తోంది.

మిస్టర్ విజయ్ దేవరకొండను పరిచయం చేస్తున్న రష్మిక!

తన భర్తను ప్రపంచానికి పరిచయం చేస్తూ రష్మిక షేర్ చేసిన మొదటి ఫోటో. “హాయ్ మై లవ్స్.. నా భర్త విజయ్ దేవరకొండను మీకు పరిచయం చేస్తున్నా” అంటూ పెట్టిన క్యాప్షన్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది.

నిజమైన ప్రేమకు నిర్వచనం!

విజయ్ తన జీవితంలోకి వచ్చాకే నిజమైన ప్రేమ అంటే ఏంటో తెలిసిందని రష్మిక పేర్కొన్నారు. విజయ్ తనను ఎలా మార్చాడో, తన లక్ష్యాలను ఎలా పెద్దగా చేశాడో ఈ ఫొటోలో వారిద్దరి చూపులే చెబుతున్నాయి.

లక్ష్యాల వైపు నడిపించే తోడు!

“మనం అనుకున్న దానికన్నా ఎక్కువ సాధించగలమని నిత్యం ప్రోత్సహించే వ్యక్తి” అని విజయ్ గురించి చెబుతూ రష్మిక షేర్ చేసిన బ్యూటిఫుల్ పిక్.

భావ వ్యక్తీకరణకు అడ్డు చెప్పని భర్త!

మనసులో ఉన్న భావాలను నిరభ్యంతరంగా చెప్పినా.. ఎప్పుడూ అడ్డు చెప్పకుండా అర్థం చేసుకునే వ్యక్తి విజయ్ అంటూ రష్మిక ఎమోషనల్ అయ్యారు. ఆ బాండింగ్ ఈ ఫొటోలో క్లియర్ గా కనిపిస్తోంది.

స్నేహితుడిగా.. భర్తగా!

ప్రయాణాల్లో స్నేహం ఎంత గొప్పదో విజయ్ దగ్గరే నేర్చుకున్నానని రష్మిక రాసుకొచ్చారు. అందుకే ప్రాణ స్నేహితుడే తన భర్త అవ్వడం తన అదృష్టమని ఆమె ఫీలవుతున్నారు.

“విజ్జూ.. మాటలు సరిపోవు!”

విజయ్‌ను ముద్దుగా ‘విజ్జూ’ అని పిలుచుకుంటూ.. అతని పట్ల తనకున్న ప్రేమని వ్యక్తపరచడానికి మాటలు చాలవని రష్మిక చెప్పడం ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తోంది.

విజయ్ దేవరకొండ ఎమోషనల్ పోస్ట్!

“ఆమె నా పక్కన ఉంటేనే ఆ రోజు సంతృప్తిగా ఉంటుంది.. ఆమె లేని రోజు వెలితిగా ఉంటుంది” అని విజయ్ తన మనసులోని మాటను బయటపెట్టారు.

భోజనం దగ్గర నుండి వ్యాయామం దాకా.. అంతా రష్మికే!

వర్కౌట్ చేసినా, భోజనం చేసినా రష్మిక పక్కన ఉంటేనే తనకు ప్రశాంతంగా ఉంటుందని విజయ్ చెప్పడం వారి మధ్య ఉన్న గాఢమైన ప్రేమకు నిదర్శనం.

పద.. కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం!

“ఇది పార్టీ చేసుకునే సమయం.. మనం కలిసి అత్యుత్తమ జీవితాన్ని జీవిద్దాం” అంటూ వైఫ్ అండ్ హస్బెండ్ గా వారు దిగిన క్లోజింగ్ వెడ్డింగ్ పిక్ మైండ్ బ్లాక్ చేస్తోంది.

మొత్తానికి ఎన్నో ఏళ్లుగా ఊరిస్తూ వచ్చిన విజయ్-రష్మిక పెళ్లి అఫీషియల్ గా జరిగిపోయింది. ఈ విరోష్ (Virosh) వెడ్డింగ్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో రికార్డులను తిరగరాస్తున్నాయి. విజయ్ దేవరకొండ భార్యగా రష్మిక మందన్న కొత్త ఇన్నింగ్స్ మొదలైంది. మరి ఈ క్రేజీ జంటకు మీ విష్షెస్ ని కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి!

Similar Posts