మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సోషియో-ఫాంటసీ చిత్రం “విశ్వంభర” ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్. దర్శకుడు వశిష్ట తన బ్లాక్‌బస్టర్ బింబిసార తర్వాత వస్తున్న ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలే ఉన్నాయి.

ఈసారి మామూలు ఫాంటసీ కాదు – ఐదు భిన్నమైన లోకాలు, పంచభూతాల ప్రాతినిధ్యం, సాక్షాత్తు ఉడుత, రెక్కల గుర్రం వంటి క్యారెక్టర్లు, చిరంజీవి నాలుగేళ్ల కొడుకుతో వచ్చే ఎమోషనల్ ట్రాక్ – ఇవన్నీ కలిపి తెలుగు సినీప్రేక్షకుడిని ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే ప్రయత్నం ఇది.

సినిమా కప్పకున్న మిస్టిక్ లేయర్లు

దర్శకుడు వశిష్ట ఈ సినిమా గురించి మాట్లాడుతూ – “మనకు తెలిసిన 14 లోకాల ఆధారంగా మరో కొత్త లోకం క్రియేట్ చేశాం. దానికి ‘విశ్వంభర’ అనే పేరు పెట్టాం. విశ్వాన్ని భరించేదే విశ్వంభర!” అంతేకాక, ఈ టైటిల్ చాగంటి కోటేశ్వరరావు సహా పలువురు పండితులతో మాట్లాడి నిర్ణయించినట్లు కూడా వశిష్ట తెలిపారు.

VFX గోల్డ్ స్టాండర్డ్

ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. అంతర్జాతీయ స్థాయి CG వర్క్ చేయబడుతుండటంతో విశ్వంభర విడుదల వాయిదా పడుతూ వచ్చింది. అయితే తాజా సమాచారం ప్రకారం: చిరంజీవి ఫైనల్ కట్ చూసి “థ్రిల్” అయ్యారని, టెక్నికల్ టీమ్ ను స్వయంగా మెచ్చుకున్నారని, విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్.

త్రిష చుట్టూ తిరిగే కథ?

సినిమాలో త్రిష పాత్ర చాలా కీలకం.

“త్రిష చాలా ఫ్రెష్‌గా కనిపిస్తుంది. సినిమా కథ మొత్తం ఆమె చుట్టూ తిరుగుతుంది” అని వశిష్ట స్పష్టంగా చెప్పారు.

ఇదే ఆధారంగా నెటిజన్లు ఊహిస్తున్నది ఏమిటంటే –

హీరో చిరంజీవి, త్రిష కోసం విశ్వంభర లోకానికి ప్రయాణం చేయడం ఈ కథాంశమా?

వశిష్ట మాటల్లోకి వస్తే,

అక్టోబర్ లో ట్రైలర్ వచ్చే ఛాన్స్ ఉందట.
అప్పుడే అసలైన మాయలోకం తలుపులు తెరుచుకోనున్నాయి.

ఈసారి చిరు అదిరిపోయేలా కనిపించబోతున్నారు. కానీ ప్రశ్న ఇదే: రెక్కల గుర్రం ఎక్కడికి తీసుకెళ్తుంది? ఉడుత ఎవరి పక్కన ఉంటుంది? విశ్వాన్ని భరించే విజన్ ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి!

, , ,
You may also like
Latest Posts from