సోషల్ మీడియా వచ్చాక ప్రతీది వివాదం అయ్యిపోతోంది. ఎవరి ఎజెండా తో వారు పనిచేస్తున్నారు. కొన్ని సినిమాలు చంపేస్తుననారు. ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’తో దేశవ్యాప్తంగా గుర్తింపు సొంతం చేసుకున్నారు దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి అవేదన ఇది.

ప్రస్తుతం వివేక్‌ అగ్నిహోత్రి ‘ది దిల్లీ ఫైల్స్‌’ (The Delhi Files) కోసం వర్క్‌ చేస్తోన్న విషయం తెలిసిందే. బాలీవుడ్‌ను ఉద్దేశిస్తూ తాజాగా ఈ సినిమాపై ఓ విశ్లేషకుడు పెట్టిన పోస్ట్‌ తీవ్ర చర్చకు దారితీసింది.

‘బాలీవుడ్‌కు ఏమైంది. వరుసగా అందరూ ఫ్లాప్‌ సినిమాలు తీస్తున్నారు. ‘ది దిల్లీ ఫైల్స్‌’ కూడా డిజాస్టర్‌ అవుతుంది’ అని ఒక విశ్లేషకుడు తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు. దీనిపై వివేక్‌ అగ్నిహోత్రి (Vivek Agnihotri) అసహనం వ్యక్తం చేశారు.

‘‘బాలీవుడ్‌ డౌన్‌ అవుతుందా? గత రెండు సంవత్సరాల్లో ఇండస్ట్రీకి ఎన్నడూ లేనన్ని వరుస విజయాలు సొంతమయ్యాయి. ‘పఠాన్‌’, ‘జవాన్‌’ ,‘గదర్‌2’, ‘యానిమల్‌’, ‘స్త్రీ 2’, ఇప్పుడు ‘ఛావా’, ఈ ఆరు సినిమాలు రూ.500 కోట్లకు పైగా వసూళ్లను సొంతం చేసుకున్నాయి.

వరుసగా ఆరు సినిమాలు ఇలాంటి విజయాలు సాధించిన పరిశ్రమ మరొకటి ఉందా? 2023 మొత్తం వసూళ్లలో బాలీవుడ్‌ నుంచే 65 శాతం కలెక్షన్లు నమోదయ్యాయి. ఒక సినీ విశ్లేషకుడిగా మీరు సినిమా డిజాస్టర్‌ కావాలని ఎందుకు కోరుకుంటున్నారు?’’ అని రాసుకొచ్చారు.

‘ది దిల్లీ ఫైల్స్‌’ లో ఇప్పటివరకూ ఎవరికీ తెలియని వాస్తవాలను చూపనున్నట్లు వివేక్‌ అగ్నిహోత్రి అన్నారు. ‘‘కొన్ని సంవత్సరాల నుంచి నేను ఎవరూ చెప్పలేని కథలను ప్రపంచం కళ్లకు కట్టినట్లు చూపించడం ప్రారంభించాను. వాటిలో మొదటిది ‘ది తాష్కంట్‌ ఫైల్స్‌’.. ఇది విమర్శకుల ప్రశంసలు అందుకుంది. రెండోది ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ ఈ సినిమా ప్రభంజనం సృష్టించింది. ఈ వరుసలో మూడోది ‘ది దిల్లీ ఫైల్స్‌’ దీన్ని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.

,
You may also like
Latest Posts from