ఒకప్పుడు తమిళ స్టార్ హీరో అజిత్ (Ajith Kumar)సినిమాలు తెలుగులోనూ బాగా ఆడేవి. అయితే గత కొంతకాలంగా ఆ ట్రెండ్ రివర్స్ అయ్యింది. తమిళంలో సూపర్ హిట్ అయిన సినిమాలు ఇక్కడ మినిమం కూడా పే చెయ్యటం లేదు. అయినా పట్టుదల విడువకుండా ఆయన సినిమాలు డబ్బింగ్ చేసి ఇక్కడ రిలీజ్ చేస్తూనే ఉన్నారు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ ‘పట్టుదల'(Pattudala).
మొదటి రోజు ఈ సినిమాకి నెగిటివ్ టాక్ రావడంతో ఓపెనింగ్స్ కూడా రాలేదు. సినిమా చాలా స్లోగా సాగడం, హీరోయిజం వంటివి లేకపోవడం, అజిత్ లుక్స్ కూడా సెట్ అవ్వకపోవడం వల్ల మన జనాలకు నచ్చలేదు.
‘పట్టుదల'(తెలుగు) కి రూ.3.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.3.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.
ఇప్పటిదాకా వచ్చిన కలెక్షన్స్ చూస్తే..
నైజాం 0.48 cr
సీడెడ్ 0.22 cr
ఉత్తరాంధ్ర 0.41 cr
ఈస్ట్ 1.11 cr
ఇక ఈ సినిమా రికవరీ అయ్యే అవకాసం లేదు.
త్రిష (Trisha) హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి మగిల్ తిరుమేని (Magizh Thirumeni) దర్శకుడు. యాక్షన్ కింగ్ అర్జున్ షార్జా ( Arjun Sarja), రెజీనా (Regina Cassandra)..లు నెగిటివ్ రోల్స్ లో కనిపించారు.