తమిళంలో ప్రముఖ హాస్య నటుడు సూరి హీరోగా, సీనియర్ నటుడు శశికుమార్, మలయాళం నటుడు ఉన్ని ముకుందన్ నటించిన చిత్రం ‘గరుడన్’. అక్కడ సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్‌తో విజయ్ కనకమేడల రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.
యంగ్ హీరోలైన నారా రోహిత్, మంచు మనోజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కె.కె రాధామోహన్ ఈ సినిమాను భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘భైరవం’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు మేకర్స్.
ఈ సినిమా షూటింగ్ గత ఏడాది శరవేగంగా షెడ్యూల్స్‌లో పూర్తయింది. సినిమా విడుదల తేదీలు చాలా సార్లు మార్చారు. భైరవం కొత్త విడుదల తేదీని మేకర్స్ ఇంకా ప్రకటించలేదు.
అసలు కారణం ఏమిటంటే, థియేటర్ మరియు నాన్-థియేట్రికల్ ఎగ్రిమెంట్స్ ఇంకా క్లోజ్ కాకపోవటమే అని తెలుస్తోంది. ఈ సినిమా రీమేక్ కావడంతో ఓటిటి సంస్దలు ఎవరూ ఈ సినిమాపై ఆసక్తి చూపడం లేదు. బెల్లంకొండ శ్రీనివాస్ కు పెద్దగా మార్కెట్ లేదు. దాంతో థియేట్రికల్ రైట్స్ విషయంలోనూ అలాగే ఉంది.
‘భైరవం’ కి క్రేజీ థియేట్రికల్ ఆఫర్లు లేవు. డీల్స్‌ను ముగించి మేలో సినిమాను విడుదల చేసేందుకు నిర్మాత కెకె రాధా మోహన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీనిపై టీమ్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.