
డిజాస్టర్స్ లో ఉన్న మురుగదాస్ కి డేట్స్ ఇస్తున్న హీరో, ఓ రకంగా దేవుడే
ఒకప్పుడు ఏఆర్ మురుగదాస్ పేరు వినిపించగానే ట్రేడ్ లో బజ్ అంచనాలు ఆకాశాన్ని తాకేది. గజిని, తుపాకి, కత్తి లాంటి సినిమాలతో తమిళ్ సినిమాను దాటి పాన్ ఇండియా స్థాయిలో తన మార్క్ వేసిన దర్శకుడు ఆయన. కానీ కాలం మారింది. వరుసగా వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అవ్వడం, క్రేజ్ క్రమంగా తగ్గిపోవడం మురుగదాస్ కెరీర్‌ను వెనక్కి నెట్టేశాయి. ఒకప్పుడు ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన దర్శకుడు, ఇప్పుడు తన తదుపరి అడుగు ఏంటి అనే ఆలోచనలో ఉన్నాడు.
ఇటీవల శివకార్తికేయన్‌తో తెరకెక్కిన ‘మదరాసి’ తమిళనాడులో యావరేజ్ రిజల్ట్ మాత్రమే అందుకుంది. ఇతర భాషల్లో అయితే ఆ సినిమా పూర్తిగా నిరాశపరిచింది. ఈ ఫలితంతో మురుగదాస్‌పై ఉన్న ఒత్తిడి మరింత పెరిగింది. గత కొంతకాలంగా ఆయన అనేక కథలపై పని చేస్తూ, బలమైన కమ్‌బ్యాక్ కోసం సరైన ప్రాజెక్ట్ కోసం వెతుకుతున్నాడు. అదే సమయంలో తమిళ్ ఫిల్మ్ సర్కిల్స్‌లో ఒక ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది.
తాజా సమాచారం ప్రకారం, మురుగదాస్ ఒక కథతో శింబును పూర్తిగా ఇంప్రెస్ చేయగలిగాడట. స్క్రిప్ట్ నచ్చడంతో శింబు తాజాగా ఫార్మల్ నోడ్ కూడా ఇచ్చినట్లు టాక్. అయితే ఈ ప్రాజెక్ట్ వెంటనే సెట్స్‌పైకి వెళ్లదు. శింబు ప్రస్తుతం వెట్రిమారన్ దర్శకత్వంలో ‘అరసన్’ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. దీనితో పాటు అశ్విన్ దర్శకత్వంలో మరో సినిమా కూడా లైనప్‌లో ఉంది. ఈ రెండు సినిమాల షూటింగ్‌లు పూర్తయ్యాక, 2026 రెండో భాగంలో మురుగదాస్–శింబు సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.
ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే ఏడాది వెలువడే అవకాశం ఉందని చెబుతున్నారు. ఒకప్పుడు బాక్సాఫీస్‌ను శాసించిన మురుగదాస్, ఇప్పుడు శింబుతో కలిసి తన కోల్పోయిన క్రేజ్‌ను తిరిగి తెచ్చుకుంటాడా? ఇది నిజంగా ఆయన కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అవుతుందా? అన్నది ఇప్పుడంతా ఇండస్ట్రీలో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రశ్న.
