మన దేశ అత్యుత్తమ సినీ సంగీత దర్శకులలో ఇళయరాజా కూడా ఒకరనే సంగతి తెలిసిందే. 1970 సంగీత దర్శకుడిగా సినీ ప్రయాణం మొదలుపెట్టి.. ఇప్పటికీ తన మ్యూజిక్‌తో శ్రోతలను మంత్రముగ్దులను చేస్తూ వస్తున్నారు. ఆయన సంగీతాన్ని ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. వివిధ భాషలలో దాదాపు ఏడు వేలకు పైగా పాటలు.. 1000కి పైగా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. తాజాగా ఇళయరాజా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇంట్రస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు.
ఈ ఇంటర్వ్యూలో ఇళయరాజా మాట్లాడుతూ.. ‘నేను మ్యూజిక్ అందించిన కొన్ని పాటల ద్వారా వెస్ట్రన్ క్లాసికల్ సంగీతాన్ని పరిచయం చేశాను. వెస్ట్రన్ క్లాసికల్ మ్యూజిక్ మీకు నేర్పించింది నేనే. సంగీత దర్శకులు మొజార్ట్, పోతోవన్ బంటి పేర్లు మీకందరికీ ఎలా తెలుసు ? వారి గురించి చెప్పింది నేనే.. నేనే వారిని మీకు పరిచయం చేశాను.
పలు విధాలుగా ప్రపంచ సంగీతాన్ని నా పాటల ద్వారా ప్రేక్షకులకు పరిచయం చేశాను. నేను సింపోనిని రూపొందించాను. అంటే నాకు సంగీతం అంటే అంత ఆసక్తి అని మీరు తెలుసుకోవాలి. ఇలా అనడం కొందరికి కడుపు మంట కావచ్చు. నా సంగీతం అందరి జీవితాల్లోనూ ఉంటుంది అని చెప్పుకొచ్చారు ఇళయరాజా.
అలాగే నా పాటలు ఎన్నో అద్భుతాలు సృష్టించాయి. నా మ్యూజిక్ విని ఓ చిన్నారి తిరిగి ప్రాణం పోసుకుంది. అంతే కాదు ఒక ఏనుగుల గుంపు సైతం నా సంగీతాన్ని ఆస్వాదించేవి. ఆ ఏనుగుల గుంపు నా పాటలు వినడానికి వచ్చాయి. ఇవన్నీ చెబితే నాకు గర్వం, పొగరు అంటారు.
అయినా నాకు అర్ధం కానీ విషయం ఏంటంటే.. గర్వం నాకు కాకపోతే వేరే వారికి ఎందుకు ఉంటుంది.? నిజమే నాకు పొగరు ఎక్కువే. ప్రపంచంలోనే ఎవరు చేయలేని దానిని నేను చేశాను. అలాంటప్పుడు నాకేగా పొగరు ఉండాలి. నాకే కదా గర్వం ఉండాలి. ప్రతిభ ఉన్నవారికే గర్వం ఉంటుంది అని ఇళయరాజా చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ కామెంట్స్ పై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.