మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ థియేటర్లలో గత నెల విడుదలైంది. ఓపెనింగ్ కాస్త బాగుండి, రివ్యూలు కూడా డిసెంట్‌గా ఉన్నా, సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే ఇప్పుడు, ఓటీటీలో ‘కన్నప్ప’ మరోసారి అదృష్టం పరీక్షించుకోబోతోంది.

ఈ వారం విండో ఓపెన్ – కన్నప్ప ఓటీటీలోకి

సినిమా విడుదల ముందు, డిజిటల్ హక్కుల కోసం మంచు విష్ణు కొందరు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌తో చర్చలు చేసినా అవి ఫలించలేదు. దీంతో థియేటర్లలో రిలీజ్ చేశారు. జూన్‌లో వచ్చిన ఈ చిత్రం మంచి ఓపెనింగ్ తోదిగినా, మౌత్ టాక్ మెల్లిగా తగ్గిపోవడంతో కలెక్షన్లు తగ్గాయి.

తాజాగా లభించిన సమాచారం ప్రకారం, కన్నప్ప సినిమాను Prime Video అందుకున్నట్లు వార్తలు ఉన్నాయి. తెలుగు సహా ఇతర దక్షిణాది భాషల్లో ఈ వారం వీకెండ్ నుంచే స్ట్రీమింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

ఇక, సినిమా థియేటర్లలో ఎనిమిది వారాల విండో పూర్తి అవ్వాల్సిన నేపథ్యంలో, హిందీ వెర్షన్ మాత్రం ఆగస్ట్ చివర్లో మాత్రమే స్ట్రీమింగ్‌కి రానుంది.

ఓటీటీలో మాత్రం రెస్పాన్స్ ఉండేలా?

భారీ తారాగణం, పురాణ నేపథ్యం కలిగిన ఈ చిత్రం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో మాత్రం మంచి రెస్పాన్స్ అందుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. థియేటర్లో మిస్ అయిన ప్రేక్షకులకు ఇది మంచి ఛాన్స్.

విశేషాలు త్వరలోనే అధికారికంగా వెల్లడయ్యే అవకాశముంది.

, , , , , , ,
You may also like
Latest Posts from