విష్ణు మంచు డ్రీమ్ మూవీ ‘కన్నప్ప’ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. విష్ణు కెరీర్‌లోనే భారీ ఓపెనింగ్స్‌ వచ్చిన మూవీగా రికార్డు సృష్టించగా వీకెండ్ కూడా అదే జోరు కొనసాగించింది. ‘కన్నప్ప’ మూవీపై ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ప్రశంసలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. తిన్నడిగా విష్ణు మంచు యాక్టింగ్ అదరగొట్టారని రివ్యూ ఇచ్చారు. తాజాగా… సంచలన దర్శకుడు ఆర్జీవీ సైతం విష్ణు యాక్టింగ్‌ను మెచ్చుకున్నారు. దీనిపై రియాక్ట్ అయిన విష్ణు ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

బాక్సాఫీస్ వసూళ్లు పట్ల విష్ణుతో పాటు మూవీ టీం సంతోషం వ్యక్తం చేసింది. నటుడిగా తన విజిటింగ్ కార్డు ‘కన్నప్ప’ అని విష్ణు అన్నారు. టాలీవుడ్ స్టార్ హీరోల నుంచి ప్రశంసలు వచ్చినట్లు చెప్పారు. ఓ సినిమా నిజాయతీగా తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని చెప్పడానికి ఇదే ఉదాహరణ అని అన్నారు. ప్రభాస్ కారణంగానే తమ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చాయని చెప్పారు. ఈ నేపధ్యంలో ఈ సినిమా గురించిన ఇంట్రస్టింగ్ అప్డేట్స్ ఇప్పుడు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

“కన్నప్ప” కోసం ఎవరికి ఎంత రెమ్యునరేషన్? ఒక్కరు మినహా అందరూ ఫ్రీగానే చేశారా?

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపొందిన “కన్నప్ప” సినిమాపై ఇండస్ట్రీలో ఓ విపరీతమైన ఆసక్తి నెలకొంది. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ మైథలాజికల్ డ్రామాలో పలు దేశాల్లో షూటింగ్ జరిపారు. బిగ్ స్కేల్‌లో చేసిన ఈ సినిమాలో పలు స్టార్ యాక్టర్లు గెస్ట్ రోల్స్‌లో కనిపించగా, ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే… వారిలో చాలా మంది రెమ్యునరేషన్ తీసుకోలేదట!

ప్రభాస్ – జీరో రెమ్యునరేషన్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ఈ సినిమాలో ఓ పవర్‌ఫుల్ రోల్ చేయడం విశేషం. అయితే మోహన్ బాబు తో ఉన్న అనుబంధం వల్లే ఆయన ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట. ఇదే విషయాన్ని మంచు విష్ణు కూడా పలు ఇంటర్వ్యూల్లో ఒప్పుకున్నాడు.

మోహన్‌లాల్ – ఒక్కరోజు షూట్, చార్జ్ ఏదీ లేదు!

మలయాళ మెగాస్టార్ మోహన్‌లాల్ కూడా ఈ సినిమాలో నటించారు. ఒక్కరోజు షూట్ చేశారంతే… కానీ రెమ్యునరేషన్ మాఫీ ఇచ్చారు.

శరత్ కుమార్ – ఫుల్ లెంగ్త్ రోల్, కానీ ఫ్రీగా!

సీనియర్ నటుడు శరత్ కుమార్ కు ఈ మూవీలో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ ఇచ్చారు. అయినా ఆయన కూడా మంచి ఫ్రెండ్‌షిప్ కారణంగా ఎలాంటి పారితోషికం తీసుకోలేదని విశ్వసనీయ సమాచారం.

ఆఖరికి అసలు రెమ్యునరేషన్ తీసుకున్నది ఎవరు?

ఈ భారీ బృందంలో ఒక్కొక్కరే పారితోషికం తీసుకున్నారు – ఆయనే బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్. ఆయన రోజుకు రూ. 2 కోట్ల చొప్పున 5 రోజులు షూట్ చేసి, మొత్తం రూ. 10 కోట్లు తీసుకున్నారు అని టాలీవుడ్ వర్గాల టాక్.

ఎక్కువ ఖర్చు – న్యూజిలాండ్, టెక్నీషియన్లు, ప్రమోషన్స్

న్యూజిలాండ్ లాంటి విదేశీ లొకేషన్లలో షూటింగ్ జరిపిన విష్ణు, టెక్నీషియన్లకు మంచి పారితోషికాలు ఇచ్చారు. అలాగే ప్రమోషన్ల మీద కూడా భారీగా ఖర్చు పెట్టారు.

వర్డ్ ఆఫ్ మౌత్ బాగుంది – నాన్-థియేట్రికల్ డీల్స్ తో వెనకడుగు లేదు!

థియేటర్లలో సినిమాకు డీసెంట్ రెస్పాన్స్ వస్తోంది. అందుకే నాన్-థియేట్రికల్ హక్కులపై మంచు విష్ణు ఫోకస్ పెంచారు. మంచి డీల్స్ రాబడతారని అంచనాలు ఉన్నాయి.

, , , , , , ,
You may also like
Latest Posts from