పవన్ కళ్యాణ్‌ అభిమానిగా ఎప్పుడూ బహిరంగంగానే మాట్లాడే కిరణ్ అబ్బవరం — ఈసారి మాత్రం తన హీరో పేరు తీసుకోవడానికే వెనకడుగు వేశాడు. తన కొత్త సినిమా “కే-రాంప్” రిలీజ్‌కి ముందు, పవన్ కళ్యాణ్‌ లేదా ఆయన తాజా చిత్రం “ఓజీ” గురించి ఏ వ్యాఖ్యలు చేయకూడదని నిర్ణయించుకున్నాడు.

దానికి కారణం కూడా చెప్పాడు కిరణ్. అతను ఇలా అన్నాడు – “పవన్ కళ్యాణ్ గారిపై నా అభిమానాన్ని అందరికీ తెలుసు. నేను ‘ఓజీ’ సినిమా ఎంత ఇష్టపడ్డానో ఇప్పుడు చెబితే, కొందరు నేను నా సినిమా ప్రచారానికి ఆయన పేరుని వాడుకుంటున్నానని అనుకుంటారు. ఆ భావన రావద్దని ఇప్పుడే మాట్లాడటం మానేశాను. తర్వాత సరైన సమయంలో నా అభిప్రాయం చెబుతాను.”

“కే-రాంప్” ఈ నెల అక్టోబర్ 18న విడుదల కానుంది. ఇందులో కిరణ్ అబ్బవరం ఒక ధనవంతుడైన యువకుడిగా, కేరళ అమ్మాయితో ప్రేమలో పడే పాత్రలో కనిపించనున్నాడు.

హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కె-ర్యాంప్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు జెయిన్స్ నాని డైరెక్ట్ చేస్తుండగా పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ రూపొందింది. ఈ మూవీ ట్రైలర్ ఇటీవల రిలీజ్ కాగా దానికి ట్రెమండస్ రెస్పాన్స్ దక్కింది.

ఇక ఈ సినిమా తాజాగా సెన్సార్ పనులు కూడా ముగించుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ‘A’ సర్టిఫికెట్ జారీ చేసింది. అయితే, ఈ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్‌కు బాగా నచ్చుతుందని చిత్ర యూనిట్ పదేపదే చెబుతుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి నెలకొంది. ఈ సినిమా రన్‌టైమ్‌ను 2 గంటల 20 నిమిషాలకు ఫిక్స్ చేశారు.

ఈ సినిమాలో యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తుండగా సాయి కుమార్, నరేష్, కామ్న జెఠ్మలానీ, మురళీధర్ గౌడ్ తదితరులు నటిస్తున్నారు. రాజేష్ దండ, శివ బొమ్మక్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.

, , , ,
You may also like
Latest Posts from