అటు ఉత్తరాది ప్రేక్షకులతో పాటు ఇటు దక్షిణాది సినీప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ‘వార్‌ 2’ (War 2). అయాన్‌ ముఖర్జీ (Ayan Mukerji) తెరకెక్కిస్తున్న ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ సంస్థ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌లో తారక్‌ (NTR)- హృతిక్‌ల మధ్య హోరాహోరీ పోరాటాలతో పాటు మంచి డ్యాన్స్‌ మూమెంట్స్‌తో నిండిన ఓ పాట కూడా ఉండనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. దాంతో ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ కలయికకు అభిమానుల్లో విపరీతమైన హైప్. కానీ, టీజర్ వచ్చాక ప్రేక్షకుల్లో చిన్న అసంతృప్తి – “ఇద్దరినీ కలిపి చూపించలేదే!” అని.

ఇక్కడే అసలు ప్లాన్ దాగి ఉంది అంటున్నారు ట్రేడ్ వర్గాలు.

వైఆర్ఎఫ్ వ్యూహం చాలా క్లియర్. హృతిక్ – ఎన్టీఆర్ స్క్రీన్ షేరింగ్ అనేది సినిమా క్లైమాక్స్ దాకా మెయిన్ హైపు పాయింట్. వీళ్లిద్దరి కాంబినేషన్‌కు విజిల్ మూమెంట్ ఇవ్వాలంటే… అది థియేటర్లోనే ఫస్ట్ టైమ్ కనిపించాలి. అందుకే టీజర్ సింపుల్. పాత్రల ప్రెజెంటేషన్ మాత్రమే. వాస్తవానికి ఇది కూడా కంట్రోల్డ్ హైప్ అనొచ్చు.

ఇంకొంచెం లోతుగా చెప్పాలంటే, ఇది వార్ ఫ్రాంచైజీలో పాత పద్ధతి. వార్ (2019) సమయంలో కూడా హృతిక్ – టైగర్ ష్రాఫ్ కలిసి ఒకే ఇంటర్వ్యూకీ హాజరుకాలేదు. సినిమా రిలీజ్ దాకా ఇద్దరూ వేర్వేరు రూట్లలో ప్రమోషన్ చేశారు. ఫైనల్ థియేటర్ విజువల్ మీదే క్రేజ్ మొత్తం ఉండాలని అప్పుడు తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు కూడా ఫాలో అవుతోంది వైఆర్ఎఫ్.

దీంతో పాటుగా, ఎన్టీఆర్ మార్కెట్ వేరు, హృతిక్ మార్కెట్ వేరు. ఒకే సమీకరణలో కాకుండా, వేర్వేరు ప్రమోషన్ స్టేజ్‌ల ద్వారా రెండు విభిన్న సెగ్మెంట్లను టార్గెట్ చేయాలన్నది కూడా స్ట్రాటజీలో భాగమే.

ఇది కేవలం టీజర్ మాత్రమే. అసలు ఆట సినిమా విడుదలకు దగ్గరయ్యే సమయంలో మొదలవుతుంది. అప్పుడు ఈ మాసివ్ కాంబో తెర మీద దేనికైనా తక్కువ కాదనిపించడమే కాక, హైప్ కూడా సుడిగాలి వేగంగా పెరిగేలా ప్లాన్ చేస్తోంది వైఆర్ఎఫ్.

, , , ,
You may also like
Latest Posts from