టాలీవుడ్ యువ హీరో విజయ్ దేవరకొండ హెల్త్ ఇష్యూస్‌తో ఆస్పత్రి చేరాడు. డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న విజయ్‌ను వెంటనే హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స జరుగుతోంది. ఈ విషయం బయటకు వచ్చేసరికి ఫ్యాన్స్ హార్ట్ బీట్‌లు పెరిగిపోయాయి. “గెట్వెల్ సూన్ రౌడీ!” అంటూ సోషల్ మీడియా మొత్తం విషెస్‌తో నిండిపోతోంది.
ఇక ఆరోగ్య సమస్యల్ని పక్కన పెడితే, విజయ్ కెరీర్ మాత్రం హై స్పీడ్‌లో దూసుకెళ్తోంది. త్వరలో రిలీజ్‌కు సిద్ధమవుతున్న ‘కింగ్‌డమ్’ సినిమాతో ఆయన మళ్లీ థియేటర్లలో సందడి చేయబోతున్నాడు. ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి డైరెక్టర్ కాగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా, సత్యదేవ్ కీలక పాత్రలో నటించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూనర్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. జూలై 31న సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది.
అంతే కాదు… బాలీవుడ్‌లో కూడా విజయ్ దేవరకొండ క్రేజ్ పెరిగిపోతోంది. రణ్‌వీర్ సింగ్ హీరోగా నటిస్తున్న డాన్ 3 మూవీలో విలన్ రోల్ కోసం రౌడీ హీరోని సంప్రదించారట. అయితే విజయ్ ఈ మాస్ విలన్ ఆఫర్‌కు ఓకే చెప్పాడా లేదా అనేది ఇంకా స్పష్టత రాలేదు. కానీ డాన్ 3 లాంటి హైప్రొఫైల్ ప్రాజెక్ట్‌కి విజయ్ పేరు రావడమే శుభసూచకం అనిపిస్తోంది.