మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘విశ్వంభర’ షూటింగ్ దాదాపు పూర్తికావొస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అసలైన సస్పెన్స్ మెగా ఫ్యాన్స్ లో మొదలైంది – ఈ సినిమాను ఎప్పటి కి రిలీజ్ చేస్తారు? సోషియో-ఫాంటసీ జానర్‌లో వస్తున్న ఈ సినిమాకి భారీ స్థాయిలో VFX వర్క్ అవసరం కావడంతో, మేకర్స్ జాగ్రత్తగా డేట్ నిర్ణయించాలనుకుంటున్నారు.

OTT డీల్ ఫిక్స్ – హాట్ స్టార్ చేతిలో డిజిటల్ హక్కులు

తాజాగా అందుతున్న సమాచారం మేరకు డిజిటల్, శాటిలైట్ రైట్స్ డీల్ పూర్తయ్యింది. Disney Plus Hotstar భారీ ధరకు రైట్స్ సొంతం చేసుకుంది. ఈ డీల్ వలన చిత్ర టీమ్ కి భారీ ఊరట లభించింది. ఇప్పుడు ఒక్క సినిమా రిలీజ్ డేట్‌ మీదే చర్చలు జరుగుతున్నాయి.

దసరా రిలీజ్‌తో మెగా క్యాలెండర్ షిఫ్ట్ అవుతుందా?

ఇండస్ట్రీ టాక్ ప్రకారం… విశ్వంభర సినిమా దసరా సీజన్లో విడుదలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మరో సినిమా — అనిల్ రావిపూడితో కలసి చేస్తున్న ఎంటర్టైనర్ — 2026 సంక్రాంతికి రిలీజ్ కావడంతో, ఈ రెండింటికీ మధ్య సరైన గ్యాప్ అవసరం.

దాంతో, విశ్వంభరను ఈ అక్టోబర్ లోపు విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది!

ఇప్పుడు పవన్ కల్యాణ్ మోస్ట్ హైప్ క్రియేట్ చేసిన యాక్షన్ ఫిల్మ్ OG కూడా దసరాకే బరిలోకి దిగబోతుందని బజ్. ఒకే కుటుంబానికి చెందిన రెండు భారీ సినిమాలు ఒకే సమయానికి రిలీజ్ అయితే – కలెక్షన్లపైనా, మార్కెట్ మీదా ప్రభావం తప్పదు. అందుకే, OG డేట్ మారుతుందా? లేక ‘విశ్వంభర’ ఓ వారం ముందో, వెనకో వెళుతుందా అన్నదానిపై పరిశ్రమలో ఉత్కంఠ నెలకొంది.

, , , , ,
You may also like
Latest Posts from