నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘ఎవడే సుబ్రహ్మణ్యం’.. సరిగ్గా 10 ఏళ్ల క్రితం ఈ మూవీతోనే ఆయన ప్రయాణం మొదలైంది. ఇందులో నాని, విజయ్‌ దేవరకొండ,మాళవిక నాయర్, రీతూ వర్మ ప్రధాన పాత్రలలో మెప్పించారు.

డైరెక్టర్‌గా పదేళ్ల జర్నీ పూర్తి చేసుకున్న నాగ్‌ అశ్విన్‌పై ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ (Vyjayanthi Movies) ఒక వీడియో విడుదల చేసింది. మహానటి, కల్కి 2898 ఏడీ చిత్రాలతో ఆయన కీర్తి మరింత ఉన్నత స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే.

తను అసెస్టెంట్ గా శేఖర్‌ కమ్ముల నుంచి నేర్చుకున్న పాఠాలతో ‘యాదోం కీ బరాత్’ అనే ఇంగ్లీష్‌ లఘు చిత్రాన్ని నాగ్‌ అశ్విన్‌ డైరెక్ట్‌ చేశారు. ఈ చిత్రానికి ప్రియాంక దత్‌ నిర్మాత కావడం విశేషం. కేన్స్ షార్ట్ ఫిల్మ్ కార్నర్ కోసం ఈ చిత్రం ఎంపిక చేయబడింది. దీంతో ఆయన జీవితం టర్న్‌ అయిపోయింది.

ఆ షార్ట్‌ఫిల్మ్‌ వల్ల నిర్మాత అశ్వనీదత్‌ కుమార్తెలు ప్రియాంక, స్వప్న సినిమా అవకాశాన్ని ఇచ్చేందుకు ముందుకొచ్చారు. అప్పుడు వారికి ‘ఎవడే సుబ్రమణ్యం’ కథను నాగ్‌ వినిపించారు. ఆ చిత్రాన్ని నిర్మిస్తామని ప్రియాంక, స్వప్న మాట​ ఇచ్చారు. అలా నాని, విజయ్‌ దేవరకొండ ప్రధాన పాత్రల్లో 2015లో నాగ్‌ అశ్విన్‌ తొలి సినిమా వెండితెరపై మెరిసింది.

, ,
You may also like
Latest Posts from