ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారిన నేపథ్యంలో తాజాగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసారురు. తెలంగాణ సంస్కృతిని హేళన చేయడం తన ఉద్దేశం కాదని, ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించాలని కోరారు.
దిల్ రాజు మాట్లాడిన మాటల్లో ముఖ్యాంశాలు
సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) ఈవెంట్ లో మన సంస్కృతిలో ఉండే దావత్ గురించి, మటన్, తెల్ల కల్లు గురించి మాట్లాడాను. ఆ మాటల్లో తెలంగాణ వాళ్లను అవమానించానని, అవహేళన చేశానని కొంతమంది మిత్రులు కామెంట్లు చేసి, సోషల్‌మీడియాలో పెట్టారని తెలిసింది.
తెలంగాణ దావత్ నేను మిస్సవుతున్నాను. సంక్రాంతికి వస్తున్న ఈ రెండు సినిమాలు విడుదలయ్యాక దావత్ చేసుకోవాలని ఉంది’ అని చెప్పటం నా ఉద్దేశం. అదే విషయాన్ని ఈవెంట్ చివరిలోనూ చెప్పా. మన సంస్కృతిని నేను అభిమానిస్తా. అది అర్థం చేసుకోకుండా సోషల్‌మీడియాలో రాద్ధాంతం చేస్తున్నారని తెలిసింది. నిజంగా మీరందరూ ఆ మాట వల్ల మనస్తాపం చెందితే క్షమించండి. నిజంగా నా ఉద్దేశం అది కాదు’’
తెలంగాణ వాసిగా ఈ రాష్ట్ర సంస్కృతిని హేళన చేస్తానని ఎలా అనుకున్నారో తెలియదు. నా మాటలు తప్పుగా అర్థం చేసుకుని ఉంటే క్షమించండి.