క్షవరం అయితే కానీ వివరం రాదు అనేది సామెత. అలాగ ఇప్పుడు ‘గేమ్ చేంజర్’ విషయంలో ఏమి మాట్లాడుకున్నా దండగే అనేది సినీ సీనియర్స్ ఉవాచ. అయితే అసలు ఈ సినిమా విషయంలో ఎక్కడ దిల్ రాజు దెబ్బ తిన్నాడు. ఏం చేసి ఉంటే తన అనుభవం అక్కరకివచ్చేది అంటే…ఓ విషయంలో ఆయన పొరపాటు చేసాడని మీడియా తేల్చింది. ఇంతకీ ఏమిటా పొరపాటు అంటే…
‘గేమ్ చేంజర్’ సినిమా బడ్జెట్ లో 25 శాతం వేస్టేజీ ఖాతాలోకి వెళ్లిందని అంటున్నారు. అంటే నాలుగు వందల కోట్లలో పాతిక శాతం అంటే వంద కోట్లు అన్నమాటే. వందకోట్లు వేస్టేజి అంటే మాటలు కాదు. ఆ రికవరీ కు ఎన్ని హిట్స్ కొట్టాల్సి ఉంటుంది.
ఇలాంటిదేదో జరుగుతుందని ముందే ఊహించిన లైకా ప్రొడక్షన్ ‘భారతీయుడు 2’ సినిమా మొదలెట్టే ముందే శంకర్ తో ఓ ఎగ్రిమెంట్ చేయించుకొంది. బడ్జెట్ దాటినా, వేస్టేజీ ఉన్నా, అనుకొన్న సమయానికి సినిమా విడుదల చేయకపోయినా, ఆ నష్టాన్ని శంకర్ భరించాల్సిందే.
లైకా ప్రొడక్షన్ ఎగ్రిమెంట్ ప్రకారమే ‘భారతీయుడు 2’ తీశారు. ఆ వివాదాలే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఇలాంటి ఎగ్రిమెంట్ ఏదీ.. దిల్ రాజు శంకర్ తో చేయించలేకపోయకపోవటమే ప్రధాన సమస్య అంటున్నారు. అలా చేసి ఉంటే ఖచ్చితంగా సినిమా కు నష్టపోయినా రికవరీ ఉండేది. శంకర్ ఇంత వేస్టేజ్ అయితే చేసేవారు కాదు.
ఆర్.ఆర్. ఆర్ వంటి మెగా బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్ నుంచి వచ్చిన సినిమానే గేమ్ చేంజర్. అలాగే రూ.400 కోట్లకు పైగా బడ్జెట్ తో దిల్ రాజు తన బ్యానర్లో 50వ సినిమాగా గేమ్ చేంజర్ ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చాడు. ఎన్నో అంచనాలతో, ప్రత్యేకలతో వచ్చిన ఈ సినిమా మార్నింగ్ షో నుంచే నెగిటివ్ టాక్ మూట కట్టుకుంది. అయితే మేకర్స్ మాత్రం కలెక్షన్స్ పరంగా అదిరిపోయిందని పోస్టర్ వదిలితే అదీ ట్రోలింగ్ కు గురి అయ్యింది