వరస పెట్టి అల వైకుంఠపురం లో, పుష్ప, పుష్ప 2 సినిమాలతో హ్యాట్రిక్ విజయాలను అందుకున్నాడు అల్లు అర్జున్. దాంతో అల్లు అర్జున్ ఇప్పుడు త‌న త‌దుప‌రి చిత్రాన్ని ఏ దర్శకుడుతో చేయ‌నున్నాడ‌నేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అయితే ఆ ప్రాజెక్టు ఖరారు అయ్యిపోయింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తోనే అని క్లారిటీ వచ్చేసింది. ఆయన ఆ సినిమా పనిలో ఉన్నారు. ఇప్పుడు ఉన్నట్టుండి అట్లీ పేరు పైకి వచ్చింది. త్రివిక్రమ్‌ సినిమా కంటే ముందుగా, అట్లీ సినిమా మొదలవుతుందన్న ఓ గాసిప్‌ టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది.

బన్నీ – అట్లీ కాంబోలో ఓ సినిమా ఉంటుందని చాలా కాలంగా వినిపిస్తోంది. కాకపోతే.. త్రివిక్రమ్‌ కంటే ముందే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలు తక్కువ. మరో ప్రక్క అల్లు అర్జున్ తో సినిమాలు చేయాలని భాషతో సంబంధం లేకుండా దర్శకులంతా కూడా ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలో ప్రముఖ నటుడు, దర్శకుడు బసిల్ జోసెఫ్ కూడా అల్లు అర్జున్ ని కలిసి ఒక థ్రిల్లర్ కథ చెప్పాడట. అల్లు అర్జున్ కూడా బసిల్ చెప్పిన కథకు ఇంప్రెస్ అయ్యాడని తెలుస్తుంది. ఇద్దరి మధ్య మరోసారి చర్చలు జరిగే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది.

థ్రిల్లర్ కథల్లో బసిల్ జోసెఫ్ కు మంచి పట్టు ఉంది. ఇప్పటికే అతను ఎన్నో సూపర్ హిట్ థ్రిల్లర్ స్టోరీస్ తీశాడు. ఇప్పుడు అల్లు అర్జున్ కోసం మరో థ్రిల్లర్ కథ రెడీ చేశాడట. ఫస్ట్ వెర్షన్ విన్న బన్నీ పాజిటివ్ గా స్పందించాడని టాక్.

త్వరలోనే వీరిద్దరి మధ్య మరోసారి డిస్కషన్ జరిగే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. మలయాళంలో అల్లు అర్జున్ కి సూపర్ క్రేజ్ ఉంది. బసిల్ జోసెఫ్ తో సినిమా అంటూ చేస్తే మాత్రం ఆ సినిమా రేంజ్ వేరేలా ఉంటుందంటున్నారు ఫ్యాన్స్.

You may also like
Latest Posts from