కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ (NTR) హీరోగా నటించిన సినిమా ‘దేవర’. రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం మంచి సక్సెస్ ని అందుకొని ఎన్టీఆర్ అభిమానుల్లో జోష్ నింపింది. సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకువచ్చిన ‘దేవర’ రూ.500కోట్ల క్లబ్‌లోకి చేరింది. దీనికి కొనసాగింపుగా పార్ట్ 2 (Devara 2) రానుందని దర్శకుడు గతంలోనే ప్రకటించారు. ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. దాంతో అంచనాలు మించేలా ,నార్త్ ఇండియా మార్కెట్ లో ముందుకు వెళ్ళేలా అక్కడ నుంచి మరో హీరోని సినిమాలోకి తీసుకొస్తున్నారని తెలుస్తోంది. ఆ హీరో ఎవరు.
ప్రస్తుతం ‘దేవర పార్ట్-2’ స్క్రిప్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. స్క్రీన్ ప్లే, కీలక సన్నివేశాలను ఆసక్తికరంగా మలిచేందుకు డైరెక్టర్ కొరటాల శివ, తన టీమ్ తో వర్క్ చేస్తున్నారు. ఐతే, ఈ పార్ట్ 2 కథలో చాలా మార్పులు చేస్తున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగా బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కోసం ఓ ప్రత్యేక పాత్రను డిజైన్ చేశాడని తెలుస్తోంది.
కొరటాల శివ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘దేవర 2’ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. దీంతో అభిమానుల అంచనాలు రెట్టింపయ్యాయి. ‘‘పార్ట్ 2లో జాన్వీ (Janhvi kapoor) పాత్ర అసాధారణంగా ఉంటుంది. ఆశ్చర్యపోతారు. మొదటిభాగం కంటే రెండోభాగం చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. సినిమా చూసే ప్రేక్షకులు సీట్ ఎడ్జికి వస్తారు. ఒక దర్శకుడిగా నేను పార్ట్ 2 విషయంలోనూ ఎంతో నమ్మకంగా, ఆసక్తిగా ఉన్నాను.
కథలో అసలు మలుపు పార్ట్ 2లోనే ఉంది. ప్రతీ పాత్ర హైలో ఉంటుంది. ఎన్టీఆర్ అభిమానులందరికీ ఒక్కటే చెబుతున్నా.. పార్ట్1లో మీరు చూసింది 10 శాతమే.. రెండో భాగంలో 100శాతం చూస్తారు. ప్రతీ పాత్రలో ట్విస్ట్ ఉంటుంది (Devara 2 Story). కొన్ని సన్నివేశాలు మీరు జీవితంలో మర్చిపోలేని అనుభూతిని అందిస్తాయి. ఈ విషయంలో ప్రామిస్ చేస్తున్నాను. తారక్ నటన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అతడు తన పాత్రకు జీవం పోస్తాడు’ అని కొరటాల శివ ‘దేవర 2’ విషయంలో ధీమా వ్యక్తంచేశారు.
కాగా వచ్చే ఏడాది జనవరి చివరి వారం నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇక ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించారు. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషించారు. అనిరుధ్ మ్యూజిక్ అందించారు. అలాగే, ఈ చిత్రంలో శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, అజయ్, మురళీ శర్మ ఇతర కీలక పాత్రల్లో నటించారు. దేవర పార్ట్ 2 లో కూడా వీరి పాత్రలు కీలకంగా ఉండబోతున్నాయి. అలాగే దేవర పార్ట్ 2లో దేవర కథ ఎక్కువుగా ఉంటుందట. పైగా కథలో చాలా డెప్త్ ఉంటుందని తెలుస్తోంది