ల్లు అర్జున్‌ (Allu Arjun) – అట్లీ (Atlee Kumar) సినిమా మొదలయ్యేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. పుష్ప 2 తర్వాత చేసే చిత్రం కావటంతో ఈ సినిమాపై చాలా అంచనాలు ఉన్నాయి. ఈ నేపద్యంలో మీడియాలో గత కొన్ని రోజులుగా ఈ సినిమా గురించి రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా మరో రూమర్‌ బయటకు వచ్చింది. ఈ సినిమా చెయ్యాలంటే డైరక్టర్ అట్లీ కొన్ని కండీషన్స్ కు లోబడి ఉండాలని అన్నారట.

అందులో ముఖ్యమైంది ఎట్టి ప‌రిస్థితుల్లో ఏడాదిలోగా సినిమా పూర్తి చేయాల‌ని కండీష‌న్ పెట్టాడుట‌. అందుకు అట్లీ కూడా ఓకె చెప్పిన‌ట్లు స‌మాచారం. పాన్ ఇండియా చిత్ర‌మ‌ని సంవ‌త్స‌రాల పాటు సాగ‌దీస్తే వీలు ప‌డ‌ద‌ని… వేగంగా సెట్స్ కి వెళ్లి అంతే వేగంగా ముగించుకుని రావాల‌న్నది బ‌న్నీ ప్లాన్.

మరో ప్రక్క అల్లు అర్జున్ కోస‌మే త్రివిక్ర‌మ్ ఎదురు చూస్తున్నాడు. ఈయ‌న కూడా చాలా కాలంగా బ‌న్నీకోసం కథ రాసి పెట్టుకుని వెయిట్ చేస్తున్నాడు. తన కెరీర్ లో మూడు సక్సెస్ లు ఇచ్చిన గురూజీని హోల్డ్ లో పెట్ట‌డం ఇష్టం లేక‌పోయినా? అట్లీ తో కుదుర్చుకున్న అగ్రిమెంట్ కార‌ణంగా త‌ప్ప‌లేద‌నే మాట వినిపిస్తుంది.

అలాగే ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్లు ఉంటారట. అందులో ప్రధాన హీరోయిన్ గా జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) నటిస్తుందని సమాచారం. ఇందులో విదేశీ హీరోయిన్స్ కూడా ఉంటారట. దీని కోసం చిత్ర టీమ్ ఎంపిక ప్రక్రియని మొదలు పెట్టినట్టు సమాచారం. త్వరలోనే విదేశీ భామలు ఇద్దరిని ఫిక్స్‌ చేస్తారట.

ఆ తర్వాత మన దేశంలో మరో ఇద్దరు నాయికల్ని ఓకే చేస్తారని సమాచారం. ఇక అల్లు అర్జున్‌ ఈ సినిమా కోసమే విదేశాలకి వెళ్లి ప్రత్యేక శిక్షణని పూర్తి చేసుకుని ఇటీవలే తిరిగొచ్చారు.

, ,
You may also like
Latest Posts from