చిన్న వయసులోనే ‘1-నేనొక్కడినే’ సినిమాలో గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చి అదరకొట్టిన గౌతమ్, ఇప్పుడు రియల్ గేమ్ స్టార్ట్ చేసారు. న్యూయార్క్‌లోని ప్రసిద్ధ NYU టిష్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో యాక్టింగ్ శిక్షణ తీసుకుంటున్న గౌతమ్.. తాజాగా ఓ మైమ్ ప్రదర్శనలో పాల్గొన్నాడు. ఈ మైమ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Little steps…. GG ♥️ @urstrulyMahesh
— NST (@urstrulyNST) March 20, 2025
Gautam acted in mime created by his fellow students 🙂 pic.twitter.com/lq6nUz5smh
క్యాండిల్ లైట్ డిన్నర్ సన్నివేశాన్ని మాటలు లేకుండా భావోద్వేగాలతో అందించడం ఈ ప్రదర్శన ప్రత్యేకత. ఇందులో గౌతమ్ నటనకు అభిమానులు ఫిదా అవుతున్నారు.
నవ్వు, కోపం, బాధ వంటి ఎమోషన్లు గౌతమ్ ఎలాంటి డైలాగ్స్ లేకుండానే చాలా క్లాస్‌గా ప్రెజెంట్ చేయగలగడం ఆకట్టుకునే అంశం. ఈ మైమ్ వీడియోను సెరాఫీనా జెరోమీ డైరెక్ట్ చేయగా, గౌతమ్‌తో పాటు కాశ్వీ రమణి కీలక పాత్రలో కనిపించింది.