తెలుగులో టాప్ ప్రొడక్షన్ హౌస్ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణంలో వ‌చ్చిన టిల్లు స్క్వేర్ , మ్యాడ్ స్క్వేర్ ఒక విషయంలో కామన్. అదేమిటంటే…ఎన్టీఆర్ సెంటిమంట్. ఈ రెండు చిత్రాల ఫస్ట్ పార్ట్ లు సెన్సేషన్ విజయం సాధించాయి. రెండో పార్ట్ లు సోసో టాక్ వచ్చినా కలెక్షన్స్ కుమ్మేస్తున్నాయి. అంతేకాదు గతేడాది మేలో విడుదలైన టిల్లు స్క్వేర్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు, MAD స్క్వేర్ కూడా ఒక సంవత్సరం తర్వాత అదే నెలలో విడుదలై అదే విజయాన్ని పునరావృతం చేసింది.

ఇక టిల్లు స్క్వేర్ సక్సెస్ వేడుకలకు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా వచ్చారు. ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ సినిమాకు ఎన్టీఆర్ గెస్ట్ గా రాబోతున్నారు. మ్యాడ్ సినిమాకు సీక్వెల్‌గా మ్యాడ్ స్క్వేర్ (MAD Square) చిత్రం రాగా.. మొద‌టి పార్ట్‌లో న‌టించిన జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్, సంతోష్ శోభన్ సోదరుడు సంగీత్ శోభన్‌తో పాటు త‌దిత‌రులు ఈ సినిమాలో కీల‌క పాత్ర‌లో న‌టించారు. ఈ సినిమాకు క‌ళ్యాణ్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. నాగ‌వంశీ నిర్మించాడు.

మార్చి 28న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం సూప‌ర్ హిట్ అందుకున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం థియేట‌ర్ల‌లో ఈ చిత్రం మంచి క‌లెక్ష‌న్ల‌తో ర‌న్ అవుతుండ‌గా.. చిత్ర‌బృందం సాలిడ్ అప్‌డేట్‌ను పంచుకుంది. ఈ సినిమా స‌క్సెస్ వేడుక‌కు జూనియ‌ర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా రాబోతున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

ఎన్టీఆర్ సినిమాల విష‌యానికి వ‌స్తే.. ఇప్ప‌టికే వార్ 2 షూట్‌లో బిజీగా ఉన్న ఈ హీరో ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌నీల్‌తో ఒక సినిమా చేస్తున్నాడు. మ‌రోవైపు ‘దేవర-2’ సైతం ఈ ఏడాదిలోనే సెట్స్‌మీదకు వెళ్లనుంది.

సోలో హీరోగా ఎన్టీఆర్‌ కెరీర్‌లోనే ‘దేవర’ బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. దీంతో సీక్వెల్‌పై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. దర్శకుడు కొరటాల శివ ప్రస్తుతం ఈ స్క్రిప్ట్‌పై తన టీమ్‌తో పనిచేస్తున్నారు.

, , ,
You may also like
Latest Posts from