రీసెంట్ గా తెలుగు చిత్రం, కోర్ట్, బాలీవుడ్ చిత్రం, ఛావా ఏప్రిల్ 11న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేయడం ప్రారంభించింది. ఆశ్చర్యకరంగా, ఇండియాలో ట్రెండింగ్ జాబితాలో నెం. 1 స్థానాన్ని ఆక్రమించి, ఛావాపై కోర్ట్ ముందంజ వేసింది. ఛావా ఆ లిస్ట్ లో నంబర్ 2 స్లాట్‌ను ఆక్రమించింది.

కోర్ట్ ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ మరియు హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుండగా, ఛావా తెలుగు,హిందీలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది.

ఛావా.. బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించిన లేటేస్ట్ హిట్ మూవీ ఛావా. ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ముఖ్యంగా ఇందులో తన అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు విక్కీ కౌశల్. ఈ సినిమాలోని క్లైమాక్స్ సీన్ ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టించింది.

ఈ ఏడాది తెలుగులో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సినిమా కోర్ట్. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా భారీగా వసూళ్లు రాబట్టింది.

, , , , , , ,
You may also like
Latest Posts from