పాన్-ఇండియన్ స్టార్ ప్రభాస్ వరుసగా భారీ బడ్జెట్ చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రీసెంట్ గా హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఫౌజీ షూటింగ్ ను ప్రారంభించాడు. ఈ చిత్రం స్వాతంత్ర్యానికి పూర్వం జరిగిన సంఘటనల నేపథ్యంలో సాగుతుంది మరియు ప్రభాస్ సైనికుడి పాత్రను పోషిస్తున్నాడు.

హను తన పొయిటిక్ గా చెప్పే కథనానికి పాపులర్. అలాగే ప్రతిభావంతులైన ఆర్ట్ డైరక్టర్స్ ద్వారా చరిత్రను పునఃసృష్టిస్తున్నాడు. ఈ సినిమాకు భారీ బడ్జెట్ ని ఖర్చుపెడుతున్నట్లు సమాచారం.

ఈ చిత్రంలో కీలకమైన పాత్రను పోషించనున్న మిథున్ చక్రవర్తి చెప్పినదాని ప్రకారం ఈ చిత్రం రూ. 700 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించబడింది. నిర్మాతలు ఈ కాన్సెప్ట్ ని ఇష్టపడ్డారు. ఈ చిత్రంపై పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నారు. ప్రభాస్ మార్కెట్ కూడా దీనికి మినహాయింపు కాదు. అతని సినిమాలు సులభంగా రూ. 1000 కోట్లు దాటి సంపాదించగలవు.

ప్రభాస్ తన రెమ్యునరేషన్ ను కూడా పెంచాడు. దాంతో ఈ చిత్రానికి మొత్తం రూ. 700 కోట్లు ఖర్చవుతుంది. ఇమాన్వి హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతోంది.

విశాల్ చంద్రశేఖర్ సంగీతం, నేపథ్య సంగీతాన్ని అందించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు.

, , ,
You may also like
Latest Posts from