సినిమాల్లో అలరించే నటులు ఇప్పుడు బిజినెస్ రంగానికీ విస్తరిస్తున్నారు. ముఖ్యంగా ఫుడ్ బిజినెస్‌లలో ఎంతో ఆసక్తి చూపిస్తూ, మంచి విజయాలు అందుకుంటున్నారు. అందుకు తాజా ఉదాహరణ — అక్కినేని నాగచైతన్య.
నగరంలో ‘షోయు’ పేరుతో రెస్టారెంట్ ప్రారంభించిన నాగచైతన్య, ప్రస్తుతం ఫుడ్ బిజినెస్‌లోనూ సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, “రిచ్ ఫ్లేవర్స్‌తో కస్టమర్లకు నాణ్యమైన వంటకాలను అందించడమే మా లక్ష్యం” అని తెలిపారు.
ఇదిలా ఉండగా, హీరో ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా జపాన్ వెళ్లిన సందర్భంగా, అక్కడ ‘షోయు’ గురించి ప్రశంసలతో మాట్లాడారు. ఎన్టీఆర్ వ్యాఖ్యలు చూసి ఎంతో ఆనందించానని నాగచైతన్య చెప్పారు.
లాక్డౌన్ సమయంలో ప్రీమియం క్లౌడ్ కిచెన్ ఏర్పాటు చేయాలనే ఆలోచన కలగగా, అదే ఆలోచనను అమలుచేసి ‘షోయు’ ప్రారంభించినట్లు చైతన్య గుర్తు చేశారు. ప్రస్తుతం ఈ రెస్టారెంట్ మంచి ఆదరణతో విజయవంతంగా నడుస్తోందని అన్నారు.