కేవలం కమర్షియల్ సక్సెస్ పొందడం ఒక్కటే కాదు… ఫిల్మ్ ఫెస్టివల్స్ లో గుర్తింపు రావడం ఇంకో లెవల్ కిక్!

అలాంటి గర్వకారణం ఇప్పుడు కిరణ్ అబ్బవరం నటించిన ‘క’ చిత్రానికి దక్కింది. దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ చిత్రం విభాగానికి ‘క’ నామినేట్ అయిందని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ నెలాఖరున ఢిల్లీలో జరిగే వేడుకల్లో విజేతలకు అవార్డులు అందించనున్నారు.

గత ఏడాది అక్టోబర్ 31న విడుదలైన ‘క’ సినిమా, చిన్న సినిమాగా రిలీజ్ అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. మొదటి వారమే బ్రేక్ ఈవెన్ సాధించి, తర్వాత స్టడీగా మంచి కలెక్షన్లు రాబట్టింది.

కేవలం థియేటర్లలోనే కాదు, ఓటిటి ప్లాట్‌ఫామ్ ‘ఆహా’లో కూడా ‘క’ అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకుంది. స్ట్రీమింగ్ మొదలైన తొలి వారం నుంచే టాప్ 10 లిస్టులో నిలుస్తూ సూపర్ హిట్ గా నిలిచింది.

సుజీత్, సందీప్ లు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయన్ సారిక కథానాయికగా నటించారు. కిరణ్ అబ్బవరం తన సొంత బ్యానర్‌పై రూపొందించిన ఈ సినిమాను చింతా గోపాలకృష్ణ నిర్మించారు.

మొత్తానికి ‘క’ సినిమా, కిరణ్ అబ్బవరం కెరీర్‌లోనే అతిపెద్ద హిట్‌గా నిలిచింది. కమర్షియల్ పరంగా గర్వంగా నిలిచిన ఈ సినిమా, ఫిల్మ్ ఫెస్టివల్ లెవల్లో గుర్తింపు అందుకోవడం మరో గొప్ప మైలురాయిగా మారింది.

,
You may also like
Latest Posts from