ఇన్నాళ్లూ ఫ్యామిలీ హీరోగా మెరిసిన శర్వానంద్… ఇప్పుడు మారిపోయాడు. ఓ టైం లో ప్రేమకథలూ, సాఫ్ట్ ఎమోషనల్ డ్రామాలతో ప్రేక్షకుల హృదయాల్లో దూసుకెళ్లిన శర్వా – ఇప్పుడు రక్తపు బాట పట్టాడు. ట్రెండ్ మారింది… ప్రేక్షకుల నాడిని గుర్తుపట్టాడు!
ఇప్పటి తెలుగు సినిమా ట్రెండ్ వేరే లెవల్‌లో ఉంది. ఎక్కడ చూసినా యాక్షన్, వైలెన్స్, బ్లడ్ బాత్‌లే. ‘హిట్ 3’ ట్రైలర్ చూసినవాళ్లకి అర్థమై ఉంటుంది… ఇప్పటి స్క్రీన్‌పై హింసకు కొత్త నిర్వచనం వస్తోంది.
నాని లాంటి నాచురల్ స్టార్ నుంచి… ఎన్టీఆర్, బన్నీ, ప్రభాస్ లాంటి మాస్ మషీన్‌ల దాకా… రక్తంతో ఓదార్పు చెబుతున్నారు. విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’లో కూడా అదే మసాలా కనిపిస్తోంది.
ఇలాంటి తరుణంలో శర్వానంద్ కూడా అదే బాట పట్టాడు. సంపత్ నంది దర్శకత్వంలో ఆయన కొత్త సినిమా ‘భోగి’ మొదలవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా విడుదలైన గ్లింప్స్ చూస్తే… ఇది శర్వా కెరీర్‌లో లెక్కే వేరే టర్న్.
సంపత్ నంది ఈ సినిమా గురించి ఎప్పటినుంచే చెబుతున్నాడు – “యాక్షన్ నెక్ట్స్ లెవిల్ లో ఉంటుంది”… అంటూ. ఇప్పుడు విడుదలైన గ్లింప్స్ కన్ఫర్మ్ చేసింది.
ఇక ఈ తరం ప్రేక్షకుల కు హింస ఓ ఎంటర్‌టైన్‌మెంట్ ఎలిమెంట్ అయిపోయింది. ‘యానిమల్’, ‘మార్కో’ లాంటి సినిమాల్లో హింస హద్దులు దాటినా… ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. ఇప్పుడు ఆ లైన్లో ‘హిట్ 3’, ‘పారడైజ్’, ‘కింగ్‌డమ్’… ఇప్పుడు ‘భోగి’ కూడా అదే ట్రాక్‌లో దూసుకెళ్తోంది.
ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది. త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈసారి శర్వా చేతిలో తుపాకీ ఉంది… కళ్లలో తుపాను ఉంది!