శైలేష్ కొలను గురించే ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుతోంది. అతన్ని టాలెంట్, టెక్నిక్, విశ్వసనీయత సమ్మిళితంగా వర్ణిస్తోంది. హిట్ 1, హిట్ 2 సినిమాల‌తో ముందుకు వెళ్లిన శైలేష్ కొలను, ఇప్పుడు హిట్ 3 తో మ‌రో సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఈ మధ్యలో చేసిన సైంధవ్ అనే ప్లాఫ్ మాత్రం కెరీర్ లో మచ్చలా మారింది.

సైంధవ్ ఫెయిల్యూర్ తో ధైర్యం కోల్పోక ముందుకెళ్లి, ‘వెంకటేష్’తో నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై మళ్లీ దృష్టి సారించి సంక్రాంతికి వస్తున్నాం అనే సూపర్ హిట్ ఇచ్చారు. అలాగే ఇప్పుడు శైలేష్ సైతం హిట్ 3 తో ఓ సూపర్ హిట్ ఇచ్చారు. అయితే వెంకటేష్ కు హిట్ ఇవ్వలేకపోయాననే బాధ ఆయనలో ఉందిట.

సైంధవ్ విడుదల తరువాత, వెంకటేష్ త‌నకు మాన‌సిక అండగా నిలిచారని, వారి మధ్య బాండింగ్ పెరిగినట్లు చెప్తున్నారు శైలేష్. వెంకీకి రుణం తీర్చే క్రమంలో ఓ మంచి విజయాన్ని ఇచ్చే ఉద్దేశంతో మళ్లీ ఆయనతో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు.

హిట్ 3 విజయంతో ఈ కాంబోపై సందేహాలు లేకుండా, శైలేష్ ఇప్పుడు రొమాంటిక్ కామెడీ చిత్రాన్ని రూపొందించాలని భావిస్తున్నాడు. రొమాంటిక్ కామెడీ జానర్‌లో వెంకటేష్‌తో కలిసి కథ రాయాలనే ఆలోచన కలిగింది. శైలేష్ అంతటా యాక్షన్, థ్రిల్లర్ చిత్రాలతోనే కాకుండా వెంకీతో ఓ కొత్త ప్రయాణం మొదలెడతాను అంటున్నారు.

, ,
You may also like
Latest Posts from