నేషనల్ అవార్డు విన్నింగ్ నటి కంగనా రనౌత్‌కి ఇటీవల సరైన హిట్ దక్కలేదు. ఎమర్జెన్సీ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నా, ఆ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. రివ్యూలు, కలెక్షన్లు – రెండూ నిరాశపరిచాయి. అయినా, వెనకడుగు వేయని కంగనా ఇప్పుడు ఒక పెద్ద బెట్ వేసింది — అది బాలీవుడ్ నుంచి నేరుగా హాలీవుడ్‌కి జంప్ చేయడం!
తాజాగా కంగనా రనౌత్ ‘Blessed Be the Evil’ అనే హాలీవుడ్ హారర్ డ్రామాలో లీడ్ రోల్ చేయనున్నారు. ఈ సినిమాలో ఆమెకు పాటు టైలర్ పోసీ (Teen Wolf ఫేమ్), స్కార్లెట్ రోజ్ స్టెలోన్ (Sylvester Stallone కూతురు) లాంటి పేరున్న హాలీవుడ్ నటీనటులు కలిసి నటించనున్నారు.
ఈ చిత్రాన్ని Lion Movies నిర్మిస్తోంది. షూటింగ్ ఈ వేసవిలో న్యూయార్క్‌లో ప్రారంభం కానుంది. అనురాగ్ రుద్ర అనే ఇండియన్ డైరెక్టర్ – ఆయన ముందుగా Tailing Pond మరియు New Me అనే ప్రాజెక్ట్స్‌తో పాపులర్ – ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు.
ఈ సినిమాకు సంబంధించి చాలా భాగం అమెరికాలోనే షూట్ చేయనున్నారు. అంతేకాదు, ఈ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న టెక్నీషియన్స్‌లో కొంతమంది హాలీవుడ్ టాప్ టాలెంట్ కూడా ఉన్నారని సమాచారం.
ఇదిలా ఉండగా, కంగనా ప్రస్తుతం హిందీ సినిమాల్లో కొత్తగా ఎలాంటి ప్రాజెక్ట్‌కి సైన్ చేయలేదు. ఆమె ఎక్కువగా తన రాజకీయ ప్రస్థానంలో బిజీగా ఉంది.