సినిమాలో కష్టమైన యాక్షన్ సీక్వెన్స్‌లు డూప్‌ల చేత చేయించటం అనేది అతి సామాన్యం. అయితే, ఎక్కువగా, డూప్‌లు సాధారణంగా కొన్ని రోజులు మాత్రమే షూటింగ్‌లో పాల్గొంటారు. కానీ, రజనీకాంత్ తన తాజా సినిమా ‘కూలీ’లో మాత్రం రజినీకంటే ఎక్కువ సమయంలో డూప్‌ను నటింపజేసినట్లు వార్తలు వస్తున్నాయి.
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం కూలీ. ఈ సినిమాలో నాగార్జున ఓ ప్రత్యేక పాత్రలో కనబడనున్నారు. శృతిహాసన్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ ఈ సినిమాని భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఏ చిన్న అప్ డేట్ వచ్చినా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. తాజాగా ఓ విషయం మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
ఇటీవలే రజినీకాంత్ ఈ సినిమాకు మొత్తం 70 రోజులు షూటింగ్‌కి సమయాన్ని కేటాయించినట్లు తెలిసింది. అయితే, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ 70 రోజుల్లో దాదాపు 45 రోజుల షూటింగ్‌ని రజినీకాంత్ తన శరీర డూప్ చేతే పూర్తి చేశాడట! చాలా సాహసోపేతమైన సన్నివేశాలు, శారీరకంగా కష్టమైన యాక్షన్ సీక్వెన్సులను రజినీకాంత్ డూప్ చేత చేయించారట!
ఈ సినిమాకి అనిరుధ్ సంగీతం అందించారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన గ్లింప్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి.