విష్ణు మనసు పెట్టి, కలగా చూసిన ప్రాజెక్ట్ ‘కన్నప్ప’… ఇప్పుడు రికార్డులు సృష్టిస్తోంది, తన సత్తా ఏమిటో చూపించేస్తోంది! దశాబ్దకాలంగా ప్లాన్ చేసిన ఈ పాన్‌ఇండియా చిత్రానికి మార్కెట్‌ డిమాండ్‌ ఊహించదగ్గదే కాదు – మించినదే.

తాజాగా ‘కన్నప్ప’ హిందీ శాటిలైట్‌ రైట్స్‌ రూ.20 కోట్లకు అమ్ముడయ్యాయి అనే వార్తలు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ఓ ప్రముఖ నేషనల్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ సంస్థ ఈ రైట్స్‌ను సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇది నిజమే అయితే, ఇది మంచు విష్ణు కెరీర్‌లోనే అతిపెద్ద కమర్షియల్ డీల్ గా నిలవనుంది.

ఇప్పటికే సినిమాకు సంబంధించి మోహన్‌లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, శివరాజ్‌కుమార్ వంటి స్టార్ నటులు ప్రత్యక్షంగా జాయిన్ అవుతున్నట్టు ప్రచారం ఊపందుకుంది. అలాగే, భారీ విజువల్స్, నమ్మశక్యంకాని టెక్నికల్ స్టాండర్డ్స్‌ వల్ల ‘కన్నప్ప’ పాన్ ఇండియా ప్రేక్షకుల్లోనూ ఆసక్తిని రేపుతోంది.

ఇవన్నీ చూస్తుంటే… ‘కన్నప్ప’ నిజంగా ఓ సినిమాకు మించిన ప్రయాణంగా మారింది. ఇప్పుడు శాటిలైట్ రైట్స్ రూపంలో వచ్చిన ఈ భారీ డీల్ – విష్ణు కలల సినిమా విజయానికి తొలి ఘట్టంగా నిలిచిందనడంలో సందేహమే లేదు.

, , , , , , ,
You may also like
Latest Posts from