త్రివిక్రమ్ శ్రీనివాస్ – వెంకటేష్… ఈ ఇద్దరి కాంబినేషన్‌పై టాలీవుడ్ ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఎప్పటి నుంచో ఓ స్పెషల్ అటాచ్‌మెంట్ ఉంది. హ్యూమన్ ఎమోషన్స్‌ని తళతళలాడించే త్రివిక్రమ్ కలం, అలాంటి కథలో తన దృఢమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో నవ్వించే, ఏడిపించే వెంకటేష్ నటన — ఈ రెండు కలిస్తే ఫ్యామిలీ ఆడియన్స్‌కు పండగే. ఇప్పుడు ఆ కలయిక చివరకు జరిగిపోతోందని సమాచారం!

‘సంక్రాంతికి వస్తున్నాం’ సక్సెస్ తర్వాత వెంకటేష్ తన తదుపరి సినిమా ఎంచుకోవడంలో విపరీతమైన జాగ్రత్త చూపిస్తున్నారు. పక్కా ఎమోషనల్ హ్యూమన్ డ్రామా కావాలనుకున్న ఆయన, చివరకు త్రివిక్రమ్ చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్.

ఈ సినిమా షూటింగ్ ఆగస్ట్ చివరి వారంలో స్టార్ట్ కానుంది. వచ్చే సమ్మర్‌ను టార్గెట్ చేస్తూ షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘వెంకటరమణ’ అనే టైటిల్‌ను ప్రస్తుతం పరిశీలిస్తున్నట్టు ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. టైటిల్‌లోనే ఆల్రెడీ ఓ సున్నితమైన ఫ్యామిలీ టచ్ కనిపిస్తోంది.

అసలే త్రివిక్రమ్ రాసే డైలాగ్స్‌కి ఫ్యామిలీ విలువలు చక్కగా ఒదిగిపోయేలా ఉంటాయి. వెంకటేష్ చేసే పాత్ర అంటే తెలివి, తృప్తి, ఆత్మీయత – ఇవన్నీ కలిపిన ఓ గంభీరత. ఈ రెండూ కలిస్తే మరో “నువ్వే కావాలి” మిస్ చేయని మేజిక్ వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది.

ఇంతలో మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఏంటంటే… ఈ సినిమా సెట్స్‌కి వెళ్లే ముందు వెంకటేష్ చిరంజీవి – అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మల్టీస్టారర్ చిత్రంలో కూడా కనిపించనున్నాడు. ఈ సినిమా కోసం ఒక నెల రోజుల డేట్స్ కేటాయించిన వెంకీ, తక్కువ సమయంలో తన భాగాన్ని పూర్తిచేయనున్నాడు.

దీంతో పాటు ‘దృశ్యం 3’ కూడా వెంకటేష్ షెడ్యూల్‌లో ఉంది. 2025లో వెంకటేష్ నుండి వరుస సినిమాలు చూసే అవకాశం అభిమానులకు పుష్కలంగా ఉంది.

ఇక ఈ వెంకటరమణ టైటిల్ – త్రివిక్రమ్ తీస్తున్నదన్న మాటే… ఓ ట్రేడ్మార్క్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ రాబోతుందని చెప్పకనే చెప్పింది. అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నా, టైటిల్ బయటకు వచ్చిన దగ్గరినుంచి ఫ్యాన్స్‌కి ఉత్సాహం ఏ లెవెల్లో ఉందో చెప్పనక్కర్లేదు!

, , , ,
You may also like
Latest Posts from