మిథ్, మైట్, మరియు ధర్మ గర్జనతో ఉద్ధరించే మహావతార్ నరసింహుడు కథ ఇప్పుడు మీ ముందుకు రాబోతుంది – ఇది మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ (MCU)లోని తొలి అధ్యాయం. క్లీమ్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో, హోంబాలే ఫిలింస్ గర్వంగా సమర్పిస్తున్న ఈ విశిష్ట మైతలజికల్ విజువల్ వండర్, జూలై 25న భారత్ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
ఇప్పటికే విడుదలైన ట్రైలర్ చూస్తే ఒక అస్తవ్యస్తమైన, అంధకారంతో ముంచెత్తిన లోకంలోకి మనల్ని తీసుకెళ్తుంది. దేవతలకు విరుద్ధంగా తిరుగుబాటు చేసిన రాక్షస రాజు హిరణ్యకశిపుడు తనకు బ్రహ్మదేవుని నుంచి లభించిన వరంతో అమరత్వాన్ని ప్రకటిస్తాడు. అతని దుష్టపాలన సమస్త ప్రపంచాన్ని కుదిపేస్తుంది. అయితే, అదే రాజసభలో అతని కుమారుడైన బాలుడు ప్రహ్లాదుడు, భగవంతుని పట్ల అపారమైన భక్తితో నిలబడతాడు.
చీకటి, భక్తి మధ్య నిత్యసంఘర్షణ ఉధృతంగా మారిన సమయంలో, సృష్టి స్వయంగా స్పందిస్తుంది. శిలలను చీల్చుకుంటూ, ఆగ్రహంతో జన్మించిన అరుదైన అవతారం – నరసింహుడు, అర్ధమానవుడు, అర్ధసింహము – దివ్యమైన ధర్మరూపంతో ఆవిర్భవిస్తాడు.
అశ్విన్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మహావతార్ నరసింహుడు ఓ ఆధ్యాత్మిక వీరగాథ. cutting-edge VFX, భవ్యమైన విజువల్స్ తో ట్రైలర్ నరాలలో ఉర్రూతలూగించే అనుభూతిని కలిగిస్తోంది. చివర్లో వినిపించే నరసింహుని గర్జన – అది కేవలం ధ్వని కాదు… అది ధర్మం యొక్క నినాదం!
ఈ సినిమా గురించి నిర్మాత శిల్పా ధావన్ మాట్లాడుతూ, ‘శ్రీ నరసింహ, శ్రీ వరాహుల ఇతిహాస కథను ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రతి ఫ్రేమ్, ప్రతి క్షణం, ప్రతి హార్ట్ బీట్ ఈ గొప్ప కథకు ప్రాణం పోసింది. నర్సింహ గర్జన వస్తోంది’ అని అన్నారు.
దర్శకుడు అశ్విన్ కుమార్ ఈ సినిమా గురించి చెబుతూ, ‘మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ మొట్టమొదటి యానిమేటెడ్ ఫీచర్ ట్రైలర్‌ను ఆయన కృపతో ఆవిష్కరించారు. డివైన్ జర్నీ ప్రారంభమైయింది. క్లీమ్ ప్రొడక్షన్స్ విజన్, ప్రేక్షకుల కోసం న్యూ ఏజ్ మీడియా, స్క్రీన్‌తో భారత్ సంస్కృతి, వారసత్వాన్ని కాపాడుకోవాలనే భావిస్తోంది’ అని తెలిపారు.
ఈ జూలై 25, ధర్మవిజయానికి సిద్ధంగా ఉండండి. నరసింహుని roar మీ హృదయాన్ని తాకుతుంది!