భారత సినీ సంగీత ప్రపంచంలోనే అత్యధిక డిమాండ్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లలో అనిరుధ్ రవిచందర్ ఒకరు. ఎనర్జీతో నిండిన అతని లైవ్ కాన్సెర్ట్స్‌కు దేశవ్యాప్తంగా, విదేశాల్లోనూ విపరీతమైన క్రేజ్ ఉంది. తమిళనాడులో జరిగే చిత్రాల ప్రమోషన్లకు అనిరుధ్ లైవ్ షోలు చేయడం సర్వసాధారణమే.

ఇప్పుడు తాజా టాక్ ఏంటంటే… అనిరుధ్, సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వస్తున్న “కూలీ” కోసం హైదరాబాదులో భారీ సంగీత సంధ్య నిర్వహించనున్నాడట! ఇది ముఖ్యంగా తెలుగు వెర్షన్‌కు హైప్ పెంచే ప్రమోషనల్ స్ట్రాటజీ.

ఇంకా అధికారికంగా ప్రకటన వెలువడకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం ఫ్యాన్స్ already హైలోకి వెళ్లిపోయారు. హైదరాబాదులో అనిరుధ్ లైవ్ కాన్సర్ట్ అంటేనే Goosebumps ఎఫెక్ట్, అది కూడా రజినీకాంత్ సినిమాకు అయితే ఇంకెంత ఫీవర్ పెరుగుతుందో ఊహించండి!

లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌లో రజినీకాంత్‌తో పాటు ఆమిర్ ఖాన్, నాగార్జున, శృతిహాసన్, పూజా హెగ్డే, సౌబిన్ షాహిర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని ఆగస్ట్ 14న గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు.

ఈ కాన్సర్ట్‌కు సంబంధించిన అధికారిక అప్‌డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు!

, , , , ,
You may also like
Latest Posts from