ట్రెండీ లుక్స్, బ్యూటీ ఫిల్టర్స్, కాస్మెటిక్స్ జామానాలో… సహజత్వానికి సిగ్నేచర్‌గా నిలిచిన నటి సాయి పల్లవి. ఇప్పుడు అదే సౌందర్యం బాలీవుడ్ నుంచి భారీ ఆఫర్స్ వచ్చేలా చేసింది. !
భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘రామాయణ’ లో సీతగా ఆమె ఎంపికైన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు ఈ ఎంపిక వెనుక నిజమైన కారణాన్ని రివీల్ చేశారు మేకర్స్. ఎవ్వరూ ఊహించని రీజన్ ఇది!
“ఆమె గ్లామర్ రోల్స్‌కి దూరంగా ఉంటుంది. సర్జరీల ద్వారా అందం తెచ్చుకోవాలని అనదు. సహజమైన అందమే ఆమె శక్తి. ఇలాంటి నేటివిటీ ఫీల్ ఉన్న అమ్మాయి కావాలనుకున్నాం. అందుకే సీత పాత్రకు ఆమె పర్ఫెక్ట్” అని రివీల్ చేసింది రామాయణ టీమ్.
ఇది విని నెట్‌లో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ.
“ఇదే సాయి పల్లవి స్పెషాలిటీ.. మేకప్ లేకుండా మెరిసే ముద్దుగుమ్మ” అంటూ కామెంట్స్ వస్తున్నాయి.
ఒక్క నటనతోనే నేచురల్ స్టార్‌గా వెలుగుతున్న సాయి పల్లవి… ఇప్పుడు మల్టీ లాంగ్వేజ్‌లోనూ అదే విలువను నిలబెడుతోంది. ఫేక్ ఫిల్టర్స్‌కి బదులుగా నిజమైన నైజంతో సీత పాత్రను ఎలా అందిస్తుందో చూడాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
2026 దీపావళికి రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో ఆమె పాత్ర ఒక ఎమోషనల్ కి అద్దంలా నిలవబోతోందనే టాక్ వినిపిస్తోంది.