తమిళ హీరోలలో ఓవర్సీస్ మార్కెట్‌లో అన్‌మ్యాచ్‌డ్ ఫాలోయింగ్ కలిగిన సూపర్ స్టార్ రజినీకాంత్ మరోసారి తన బాక్సాఫీస్ పుల్‌ను చాటుతున్నారు. తెలుగు, హిందీ హీరోలతో పోలిస్తే యుఎస్‌లో తమిళ సినిమాల మార్కెట్ తక్కువే అయినా, రజినీకి మాత్రం ప్రత్యేక స్థానం ఉంది. ఆయన తాజా చిత్రం ‘కూలీ’ ఆ స్టామినాని మరోసారి మెల్లగా తెరపైకి తీసుకొస్తోంది.

ట్రైలర్‌ ఇంకా రిలీజ్ కాకముందే, వార్ 2 వంటి పోటీ సినిమాలు ఉంటేనూ, ‘కూలీ’ యుఎస్‌లో ముందే హాఫ్ మిలియన్ డాలర్ల మార్క్‌ (సుమారు ₹4.5 కోట్లు)ను దాటేసింది. రిలీజ్‌కు ఇంకా రెండువారాలు ఉండగానే అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డులు కొట్టడం విశేషం.

లోకేశ్ కనగరాజ్ – రజినీకాంత్ కాంబినేషన్ ఇప్పుడు ప్రేక్షకులను థియేటర్లవైపు ఎట్రాక్ట్ చేస్తోంది. అన్ని ప్రాంతాల్లో బుకింగ్స్ ఓపెన్ అయిన వెంటనే సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ‘కూలీ’ లో తెలుగు నటుడు నాగార్జున, కన్నడ స్టార్ ఉపేంద్ర, బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ కూడా ఉండటంతో, మల్టీ లాంగ్వేజ్ ఆడియెన్స్ లోనూ భారీ అంచనాలున్నాయి.

రజినీకాంత్‌కి ఇప్పటికే ఉన్న ఓవర్సీస్ రికార్డులు చెప్తే — ‘కబాలి’ ప్రీమియర్స్ alone లో $1.92 మిలియన్స్ వసూలు చేసి కోలీవుడ్లో టాప్‌లో నిలిచింది. ‘జైలర్’ కూడా డాలర్ మిలియన్‌కు దగ్గరగా ప్రీమియర్ డే కలెక్షన్ సాధించింది. ఇప్పుడు ‘కూలీ’ అదే రికార్డుల దిశగా పయనిస్తోంది.

ప్రస్తుతం వరకూ కూలీ అమెరికాలో $550K వసూలు చేసి, సాలిడ్ స్టార్ట్‌కి సెటప్ అయ్యింది. ఆగస్టు 2న ట్రైలర్ రిలీజ్ కాగానే ప్రమోషన్స్ ఫుల్ స్పీడ్‌లోకి వెళ్లే అవకాశం ఉంది. రివ్యూస్ హిట్ అయితే, మొదటి వీకెండ్‌లోనే ‘కూలీ’ ఓవర్సీస్ మార్కెట్‌ను షేక్ చేసే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.

ఈసారి రజినీ దూకుడు… మల్టీ లాంగ్వేజ్ క్రేజ్‌తో కలిపితే ‘కూలీ’ ఓవర్సీస్‌లో కొత్త చరిత్ర లిఖించేందుకు సిద్ధమవుతోంది!

, , , ,
You may also like
Latest Posts from