టాలీవుడ్‌లో మళ్లీ హాట్ టాపిక్ ప్రభాస్. ఇండస్ట్రీలో వినిపిస్తున్న గుసగుసలు చూస్తుంటే, ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ ఎంతో దూరంలో లేదనిపిస్తోంది.
రాజా సాబ్ – ప్లాన్ మారిందా?
మారుతి దర్శకత్వంలో వస్తున్న హారర్ కామెడీ రాజా సాబ్ షూట్ దాదాపు పూర్తయ్యింది. డిసెంబర్ 5 రిలీజ్ అని అధికారికంగా చెప్పినా… లోపల టాక్ – సంక్రాంతి 2026కి మార్చే ఆలోచనలో మేకర్స్. పాటలు మాత్రమే మిగిలి ఉండటంతో ఎప్పుడు రిలీజ్ చేయాలనే కన్‌ఫ్యూజన్.
ఫౌజీ – మాస్ + ఎమోషన్ ప్యాకేజ్
హను రాఘవపూడి డైరెక్ట్ చేస్తున్న పీరియడ్ యాక్షన్ డ్రామా ఫౌజీ ఇప్పటికే 50% షూట్ పూర్తి చేసేసింది. మాస్ యాక్షన్‌తో పాటు ఎమోషనల్ లవ్ స్టోరీ కూడా ఉండబోతోందట. ప్రభాస్ బల్క్ డేట్స్ ఇచ్చేసి, రెండు నెలల్లో మెజారిటీ షూట్ ఫినిష్ చేయాలని ఫిక్స్ అయ్యాడు.
లీక్ అయిన రిలీజ్ డేట్
ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్న న్యూస్ – ఫౌజీని ఏప్రిల్ 3, 2026 – గుడ్ ఫ్రైడే వీకెండ్లో రిలీజ్ చేయాలని మైత్రి మూవీ మేకర్స్ డిసైడ్ అయ్యారట. ఇంకా అధికారికంగా చెప్పలేదు కానీ, లోపల ఈ డేట్ మీదే ఎక్కువ చర్చ.
రికార్డు బడ్జెట్ & మాసివ్ సెట్స్
ఈ సినిమా కోసం రికార్డు స్థాయి ఖర్చు చేశారు. భారీ సెట్స్ వేసి, యాక్షన్ సన్నివేశాలు బిగ్ స్కేల్‌లో ప్లాన్ చేశారు. పోస్ట్ ప్రొడక్షన్‌కి ఎక్కువ టైమ్ పడుతుందని హను రాఘవపూడి ముందే ప్లాన్ చేసుకున్నాడట.
స్పిరిట్ ముందు కాదు – ఫౌజీ ముందు!
ప్రభాస్ మాట – “ఫౌజీ పూర్తయ్యాకే స్పిరిట్ సెట్స్‌కి వెళ్తా!” సాందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేసే స్పిరిట్ కంటే ముందే ఫౌజీని ఫినిష్ చేయాలని కట్టుబడి ఉన్నాడు.