హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లో మంగళవారం ఒక స్పెషల్ మీటింగ్ జరిగింది. దర్శకుడు సుకుమార్, ఆయన భార్యతో పాటు నిర్మాత యలమంచిలి రవి శంకర్ కలిసి సీఎం ని కలిశారు. ఈ సందర్భంగా జాతీయ స్థాయిలో బెస్ట్ చైల్డ్ యాక్ట్రెస్ అవార్డు గెలుచుకున్న సుకుమార్ కూతురు సుకృతివేణి ని సీఎం స్వయంగా ఫెలిసిటేట్ చేసి, అభినందించారు.
‘పుష్ప 2’ తర్వాత సుకుమార్ రైటింగ్స్ – మైత్రీ మూవీ మేకర్స్ కలసి చేసిన చిన్న సినిమా ‘గాంధీ తాత చెట్టు’ లోనే సుకృతివేణి లీడ్ రోల్ చేసింది. అవార్డు గెలవడంతో ఈ ఫిల్మ్ బజ్ మరింత పెరిగిపోయింది.
స్టోరీ వైపు:
నిజామాబాద్ జిల్లా అడ్లూర్‌లో సెట్ అయ్యే ఈ కథలో, గాంధీ సిద్ధాంతాలంటే ప్రాణం పెట్టే రామచంద్రయ్య (ఆనంద చక్రపాణి) తన పొలంలో ‘గాంధీ తాత’ జ్ఞాపకార్థం ఒక చెట్టు నాటుతాడు. ఆ చెట్టునే తన ప్రాణం లాగా కాపాడుకుంటూ, తన మనవరాలికి కూడా ‘గాంధీ’ అని పేరు పెడతాడు.
తరువాత ఊర్లో, ఇంట్లో జరిగిన సర్కమ్‌స్టాన్స్ వల్ల రామచంద్రయ్య తన భూమి, చెట్టుకు దూరమవుతాడు. ఇక్కడే అసలైన ట్విస్ట్ – చిన్నారి గాంధీ (సుకృతివేణి) తన తాత చెప్పిన గాంధీ సిద్ధాంతాలనే ఆయుధంగా చేసుకుని, ఆ చెట్టుని కాపాడటానికి శాంతియుతంగా పోరాటం చేస్తుంది.
ఆ పోరాటం ఎక్కడికి తీసుకెళ్తుంది? చిన్నారి గాంధీ తాత కలను నెరవేర్చగలదా? అన్నదే సినిమా సెంటిమెంట్–పవర్ కలిపిన సాలిడ్ పాయింట్.
ఇది “చిన్న సినిమా” అన్న ఫీలింగ్ కంటే ఎమోషన్ + సోషల్ మెసేజ్ + రియలిస్టిక్ వైబ్ ఉన్న కంటెంట్. చిన్నారి గాంధీ పోరాటంలో ‘సైలెంట్ పవర్’ ఉన్నట్టు చూపించారు.