‘వ్యూహం’ సినిమా నిర్మాత దాసరి కిరణ్‌ను ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కేసులో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడ పటమట పోలీసులు హైదరాబాద్‌లో ఆయనను అదుపులోకి తీసుకుని, అనంతరం విజయవాడకు తరలించారు.

హైదరాబాద్ బంజారాహిల్స్‌లో దాసరి కిరణ్ బంధువు గాజుల మహేశ్ ట్రావెల్ ఏజెన్సీ నడుపుతున్నారు. రెండేళ్ల క్రితం కిరణ్ ఆయన వద్ద నుంచి సుమారు రూ.4.5 కోట్ల అప్పు తీసుకున్నారు. అప్పు తిరిగి ఇవ్వాలని మహేశ్ పదేపదే అడిగినా కిరణ్ పట్టించుకోలేదని సమాచారం.

ఈ నేపథ్యంలో ఈనెల 18న మహేశ్, ఆయన భార్య విజయవాడలోని కిరణ్ కార్యాలయానికి వెళ్లగా, అక్కడ కిరణ్ అనుచరులు సుమారు 15మంది వారిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. దాంతో మహేశ్ పటమట పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి కిరణ్‌ను అరెస్ట్ చేశారు

, ,
You may also like
Latest Posts from