ప్రస్తుతం హిందీ సినిమా ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్‌ ‘రామాయణ’ . రణబీర్ కపూర్ హీరోగా, నితేష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం, రెండు భాగాలుగా భారీ బడ్జెట్‌తో (₹4,000 కోట్లు!) నిర్మితమవుతోంది.

ఈ మ్యాగ్నం ఓపస్‌కి నిర్మాత నమిత్ మల్హోత్రా ఇచ్చిన బోల్డ్ స్టేట్‌మెంట్ ఇప్పుడు సినీ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశం.

అతని మాటల్లో –

“ రామాయణం కేవలం భారతీయులకే కాదు, ఇది ప్రపంచానికి చెందిన సినిమా. హాలీవుడ్‌లో ‘అవతార్’, ‘గ్లాడియేటర్’, క్రిస్టఫర్ నోలన్ సినిమాలు ఎలాగైతే గ్లోబల్ ఆడియెన్స్‌ను కనెక్ట్ చేసాయో, అలాగే రామాయణం కూడా అన్ని కల్చర్లకు స్పీక్ అవ్వాలి,” అన్నారు.

“ వెస్ట్‌లో ఈ సినిమా నచ్చకపోతే… అది మా ఫెయిల్యూర్! అప్పుడంటే మేమే తప్పు చేశామన్న మాట. ఇది గ్లోబల్ ఆడియెన్స్ కోసం తయారు చేస్తున్న సినిమా,” అంటూ నేరుగా సవాల్ విసిరేశారు.

అంటే, రామాయణం కేవలం భక్తులకోసం కాదు… నమ్మే వాళ్లకీ, నమ్మని వాళ్లకీ కనెక్ట్ అయ్యేలా ఉండాలని నిర్మాత క్లియర్‌గా చెప్పారు.

ఇప్పుడు ఈ బోల్డ్ స్టేట్‌మెంట్‌కి ఫ్యాన్స్ రియాక్షన్ మాస్‌గా వస్తోంది.
“రామాయణం – ఇండియన్ అవతార్ అవుతుందా?” అనే క్యూరియాసిటీ సోషల్ మీడియాలో ఫుల్‌గా హైప్ క్రియేట్ చేస్తోంది.

, , , ,
You may also like
Latest Posts from