

మొదటి భాగం దృశ్యం మలయాళంలోనే కాకుండా తెలుగు, హిందీ వెర్షన్లలోనూ రికార్డ్ బ్రేకింగ్ సక్సెస్ అందుకుంది. ఇంటెన్స్ సస్పెన్స్, సింపుల్ ఫ్యామిలీ డ్రామాతో కలిపిన థ్రిల్లింగ్ స్క్రీన్‌ప్లే సినిమాకు కల్ట్ స్టేటస్ తెచ్చింది. దానికి సీక్వెల్‌గా వచ్చిన దృశ్యం 2 కూడా అంచనాలకు మించి బ్లాక్‌బస్టర్ అయ్యింది. ఓటిటీలో రిలీజ్ అయినా కూడా ఆ సినిమా హైప్, వర్డ్ ఆఫ్ మౌత్ వల్ల అన్ని లాంగ్వేజెస్‌లో రికార్డ్ వ్యూస్ సాధించింది.
అలాంటి భారీ లెగసీ ఉన్న ఫ్రాంచైజీకి దృశ్యం 3 వస్తోంది కాబట్టి, ఈ సినిమా మీద క్రేజ్, బజ్, బిజినెస్ అన్నీ స్కై హైగా ఉన్నాయి. మలయాళంలో షూట్ పూర్తి చేసిన వెంటనే తెలుగు వెర్షన్ స్టార్ట్ చేస్తానని జీతూ జోసెఫ్ ప్రకటించడంతో, తెలుగు బిజినెస్ రేంజ్ మరింత పెరిగిపోయింది. సెట్ అయ్యే స్క్రీన్ కౌంట్స్, ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి ఇప్పటికే ట్రేడ్‌లో హై టాక్ నడుస్తోంది.
అయితే షాకింగ్ విషయం ఏమిటంటే – జీతూ జోసెఫ్ స్వయంగా చెప్పినట్లుగా దృశ్యం 3లో మైండ్ గేమ్స్, క్లెవర్ ట్విస్టులు ఉండవు. కథ ఎమోషన్స్ మీదే నడుస్తుంది.
‘దృశ్యం 3’ గురించి డైరెక్టర్ జీతూ జోసెఫ్ షాకింగ్ క్లారిటీ ఇచ్చారు. మొదటి రెండు పార్ట్స్ లాగే తెలివితేటల ఆటలు, మైండ్ గేమ్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్న ప్రేక్షకులకు ఇది డిసప్పాయింట్ అవుతుందని ఆయన ఓపెన్‌గా చెప్పారు. ఈసారి కథ పూర్తిగా ఎమోషన్స్ మీదే నడుస్తుందని, స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తయిందని ఆయన తాజాగా వెల్లడించారు.
కథ రెండో భాగం తర్వాత నాలుగేళ్లకు సెట్ అవుతుందని జీతూ చెప్పారు.
“ఇది వేరే రకమైన న్యారేటివ్, కానీ ఖచ్చితంగా మంచి సినిమా అవుతుంది” అని ఆయన నొక్కి చెప్పారు.
కేవలం 45 రోజుల్లో షూటింగ్ పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారని క్లారిటీ ఇచ్చారు.
అభిమానుల్లో కుతూహలం
మొదటి రెండు పార్ట్స్‌కి మలయాళం మాత్రమే కాదు, తెలుగు, హిందీ వెర్షన్లలోనూ అద్బుతమైన రెస్పాన్స్, సక్సెస్ వచ్చింది. అలాంటి ఫ్రాంచైజీకి ఈసారైనా ట్విస్టులు లేకపోతే ఫ్యాన్స్ కన్‌ఫ్యూజ్ అవుతారా?
కొంతమంది అయితే – “జీతూ జోసెఫ్ ఉద్దేశపూర్వకంగా దృశ్యం 3ని డౌన్‌ప్లే చేస్తున్నాడు, అసలు థియేటర్‌లో మాత్రం మైండ్‌బ్లోయింగ్ ట్విస్టులు ఉంటాయి” అని గాసిప్స్ క్రియేట్ చేస్తున్నారు.
జార్జి కుట్టి కథలో ఎమోషన్స్, సస్పెన్స్ మిక్స్ ఎలా చేస్తాడో చూడటానికి ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.