బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొనెకి గత కొద్ది నెలలుగా వరుస షాకులు తగులుతున్నాయి. మొదట, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న ‘స్పిరిట్’ సినిమాలో నుంచి ఆమెను రీప్లేస్ చేశారు. ఆ వార్తే ఇండస్ట్రీ మొత్తానికి సెన్సేషన్ అయింది. ఇప్పుడు మరో బిగ్ బ్లో — ‘కల్కి 2898 AD’ సీక్వెల్ లో కూడా దీపిక లేరని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ఇక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే — ఈ రెండు పెద్ద ప్రాజెక్ట్స్ కి కామన్ లింక్ ప్రభాస్. దీంతో సోషల్ మీడియాలో ఒక హాట్ డిబేట్ మొదలైంది: “దీపికా ఎగ్జిట్ కి కారణం ప్రభాస్ అయి ఉంటాడా?” అని.

ప్రభాస్ పై సోషల్ మీడియాలో హంగామా..!

ప్రభాస్ ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఎలాంటి కాంట్రవర్సీ లో పడలేదు. తన కో-స్టార్స్ తో మంచి బాండింగ్ కలిగి ఉంటాడు. ముఖ్యంగా హీరోయిన్ ఫైనలైజేషన్ లో ఆయన ఎప్పుడూ ఇన్‌వాల్వ్ అవడంలేదని ఇండస్ట్రీ టాక్. అందుకే సోషల్ మీడియాలో వస్తున్న ఈ రూమర్స్‌కి నిజానికి సంబంధం లేదని ఫిల్మ్ నగర్ వర్గాలు క్లారిటీ ఇస్తున్నాయి.

అసలు కారణం ఏమిటి..?

ఇక దీపిక ఎగ్జిట్ వెనుక అసలు కారణం మాత్రం ఆమె డిమాండ్స్, ప్రొఫెషనల్ ఇష్యూస్ అని టాక్. గతంలో కూడా కొన్నిరోజులుగా “టూ మచ్ డిమాండ్స్ కారణంగానే మేకర్స్ వెనక్కి తగ్గారు” అని న్యూస్ వచ్చేది.

దీపిక ఫ్యూచర్ ప్రాజెక్ట్స్

ఏమాత్రం షాకులు తగిలినా, దీపికా కెరీర్ మోమెంటం మాత్రం కొనసాగుతోంది. ఇప్పుడు ఆమె చేతిలో రెండు పెద్ద సినిమాలు ఉన్నాయి:

అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్ లో వస్తున్న మాస్ ఎంటర్టైనర్

షారుక్ ఖాన్ – సిద్ధార్థ్ ఆనంద్ కాంబోలో తెరకెక్కుతున్న ‘కింగ్’

ఏదైమైనా… ప్రభాస్ తో కలిసి చేసిన రెండు ప్రాజెక్టుల నుంచి దీపిక ఔట్ కావడం నిజంగా పెద్ద కోయిన్సిడెన్స్. కానీ సోషల్ మీడియాలో ఎలాగూ టాక్స్, డిస్కషన్స్ పెడతారు, కాంట్రవర్సీ సృష్టిస్తారు. కానీ ఇండస్ట్రీ వర్గాల మాట ప్రకారం ఇది ప్రభాస్ కి సంబంధించిన విషయం కాదు, దీపిక ఓవర్ డిమాండ్స్ కారణంగా వచ్చిన డెసిషన్.

, , , , ,
You may also like
Latest Posts from