పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ నటించిన గ్యాంగ్‌స్టర్‌ డ్రామా “ఓజీ” బాక్సాఫీస్‌ దగ్గర సునామీ సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. రిలీజ్ రోజే సినిమాకు ₹154 కోట్ల ఘన వసూళ్లు రావడం, నాలుగో రోజుకే కలెక్షన్లు ₹252 కోట్ల మార్క్‌ దాటేయడం – ఇది పవన్‌ క్రేజ్‌కు గట్టి సాక్ష్యం. థియేటర్ల ముందు జాతర వాతావరణం, స్క్రీన్ల ముందు పటాకులు, మాస్‌ డైలాగ్స్ కి అభిమానుల కేరింతలు – ఇవన్నీ ఇప్పుడు ఓజీ మానియా ఏ స్దాయిలో ఉందో చూపిస్తున్నాయి.

ఇప్పుడే మరో బాంబ్‌ – స్పెషల్‌ సాంగ్‌ రీ-ఎంట్రీ!

సినిమా రిలీజ్‌కి ముందు చాలా రూమర్స్‌ క్రియేట్‌ చేసిన పాట – “కిస్‌ కిస్‌ బ్యాంగ్‌ బ్యాంగ్‌”. తొలుత మేకర్స్‌ అనివార్య కారణాల వల్ల ఈ పాటను తొలగించగా, ఇప్పుడు ఫ్యాన్స్‌కి డబుల్‌ సర్‌ప్రైజ్‌గా తిరిగి యాడ్‌ చేస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ అధికారికంగా ప్రకటిస్తూ – మంగళవారం రాత్రి షో నుంచే ఈ సాంగ్‌ స్క్రీన్‌పై రానుందని తెలిపింది.

ఈ స్పెషల్‌ సాంగ్‌లో హీరోయిన్‌ నేహాశెట్టి గ్లామరస్‌ లుక్‌తో మెరిసింది. పవన్‌ మాస్‌ అటిట్యూడ్‌తో కలిసిన ఈ బీట్‌ ఫ్యాన్స్‌కి కొత్త ఎనర్జీ ఇవ్వనుంది.

విజయోత్సవం రెడీ!

ఇప్పటికే మాస్‌ హంగామా చేస్తున్న “ఓజీ”కి, ఈ స్పెషల్‌ సాంగ్‌ జోడించడం మరింత క్రేజ్‌ క్రియేట్‌ చేస్తుందనే చెప్పొచ్చు. మేకర్స్‌ తాజాగా ప్రకటించినట్టుగా బుధవారం సాయంత్రం గ్రాండ్‌ సక్సెస్‌ సెలబ్రేషన్‌ కూడా జరగనుంది. వేదిక వివరాలు రహస్యంగానే ఉంచినా… పవన్‌ స్వయంగా ఈ ఈవెంట్‌కు హాజరుకాబోతున్నారని టాక్‌.

, , , ,
You may also like
Latest Posts from