బాలీవుడ్ క్వీన్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ తన పర్సనాలిటీ రైట్స్ కోసం ఢిల్లీ కోర్టులో కేసు వేశారనే విషయం ఇప్పటికే హాట్ టాపిక్. తాజాగా కోర్టు మధ్యంతర ఉత్తర్వులతో ఆమెకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో గూగుల్, యూట్యూబ్, మీడియా ప్రపంచం ఒక్కసారిగా కుదేలైంది.

తీర్పు ప్రకారం –

ఐశ్వర్య ఫోటోలు, వీడియోలను మార్ఫింగ్ చెయ్యరాదు

ఆమె అనుమతి లేకుండా ఏఐ ఫోటోలు, వీడియోలు క్రియేట్ చేసి వాడరాదు

ఆమె ఫోటోలను వాడుకుని లాభాలు సంపాదించరాదు

తాజా షాకింగ్ అప్‌డేట్:
ఐశ్వర్య, అభిషేక్ బచ్చన్ ఇద్దరూ కలిసి గూగుల్ పై నేరుగా కేసు వేశారు. యూట్యూబ్‌లో తన వ్యక్తిగత జీవితం, ఏఐ వీడియోలను అనుమతించడంతో గూగుల్ నష్ట పరిహారం చెల్లించాల్సిందిగా డిమాండ్ చేశారు. మొత్తంగా 4 కోట్లు అడిగారు!

గూగుల్ కి ఇది చిన్న మొత్తం మాత్రమే. కానీ, ఐశ్వర్య ఈ కేసు గెలిస్తే పెద్ద సమస్య మొదలవుతుంది.
ఇకపై క్రియేటర్లు, మీడియా సంస్థలు సెలెబ్రిటీల వ్యక్తిగత జీవితం పై వీడియోలు చెయ్యలేరు.
చేస్తే నేరుగా కోట్ల రూపాయల పరిహారం చెల్లించాల్సి వస్తుంది.
యూట్యూబ్ కూడా ఇలాంటి వీడియోలను ఇకపై ఎంకరేజ్ చెయ్యకపోవచ్చు.

అంటే, రానున్న రోజుల్లో మీడియా సంస్థలు, యూట్యూబ్ క్రియేటర్లు భారీ రెవెన్యూ కోల్పోయే ప్రమాదం ఉంది.

“ఐశ్వర్య గెలిస్తే – యూట్యూబ్ క్రియేటర్లకు గట్టి షాక్!”

, , , , ,
You may also like
Latest Posts from