సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు కొత్తేమీ కావు. కానీ ప్రతిసారీ స్టార్ హీరోయిన్లు బహిరంగంగా మాట్లాడితే మాత్రం సంచలనం రేపుతుంటాయి. తాజాగా బాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ రాధిక ఆప్టే చేసిన ఒక కామెంట్ ఇప్పుడు తెలుగు సినీ వర్గాల్లో హీట్ టాపిక్‌గా మారింది.

ఓ ఇంటర్వ్యూలో రాధిక తన జీవితంలో ఎదురైన లైంగిక వేధింపుల అనుభవం గురించి షాకింగ్ డీటెయిల్స్ వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ—

“ఒకసారి నేను ఒక తెలుగు హీరోతో ఎలివేటర్‌లో వెళ్తున్నా. పెద్దగా పరిచయం లేని వ్యక్తే. కానీ ఆ సమయంలో అతను చనువుగా మాట్లాడుతూ, ‘ఎప్పుడైనా నీ బ్యాక్ దురద పెడితే నన్ను పిలువు’ అంటూ అసభ్యంగా ప్రవర్తించాడు. నేను వెంటనే కోపంతో ఫైర్ అయ్యా, అక్కడే గొడవ జరిగింది. ఆ తర్వాత అతను మెల్లగా జారుకున్నాడు,” అని రాధిక తెలిపింది.

అయితే ఆ హీరో పేరును మాత్రం రాధిక బయటపెట్టలేదు.
కానీ ఇక్కడే విషయం ఆగలేదు—

గతంలో కూడా ఆమె ఒక తెలుగు హీరో తనను బాగా ఇబ్బంది పెట్టాడని, దాంతోనే తెలుగులో సినిమాలు చేయడం మానేశానని చెప్పుకొచ్చింది. ఇప్పుడు మరోసారి అదే తరహా వ్యాఖ్యలతో రాధిక తెలుగు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.

ఇప్పుడంతా సోషల్ మీడియాలో ఒకే ప్రశ్న —
“ఆ హీరో ఎవరు?”
“రాధిక ఆప్టే ఎవరెవరితో తెలుగు సినిమాలు చేసింది?”

ఈ ప్రశ్నలకు సమాధానం కనుగొనడానికి నెటిజన్లు తెగ రీసెర్చ్ చేస్తున్నారు.

రాధిక ఆప్టే మళ్లీ ఈ విషయాన్ని ప్రస్తావించడంతో, తెలుగు సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. కానీ ఆమె చెప్పిన “ఆ హీరో” ఎవరో వెల్లడించేంత వరకు ఈ సస్పెన్స్ కొనసాగుతూనే ఉండనుంది.

, , , ,
You may also like
Latest Posts from