‘పెళ్లి సందడితో’ యువత హృదయాలు దోచుకున్న రోషన్‌, ఇప్పుడు పూర్తిగా డిఫరెంట్ అవతారంలో కనిపించబోతున్నాడు. స్వప్న సినిమాస్‌, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్‌, కాన్సెప్ట్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘చాంపియన్’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది!

ఈ క్రమంలో ఛాంపియన్‌ విడుదల పోస్టర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్స్‌ క్రియేషన్స్, కాన్సెప్ట్‌ ఫిల్మ్స్‌ సంస్థలు సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి. స్పోర్ట్స్‌ నేపథ్యంలో ఈ సినిమాపై రోషన్‌ చాలా ఆశలు పెట్టుకున్నాడు. సుమారు 50కి పైగా కథలను రిజెక్ట్‌ చేసి ఫైనల్‌గా ఈ స్టోరీని ఆయన ఎంపిక చేసుకున్నాడు. ఆపై ఈ చిత్రాన్ని స్వప్న దత్‌ నిర్మిస్తుండంతో అంచనాలు బాగానే ఉన్నాయి.

డిసెంబర్‌ 25 – క్రిస్మస్ డేకు థియేటర్స్‌లోకి ‘చాంపియన్’ ఎంట్రీ!

ఇక ఈ క్రిస్మస్‌కి రోషన్‌ ఫ్యాన్స్‌కే కాదు, మొత్తం యువతకే స్పెషల్ ట్రీట్ రానుంది. రిలీజ్ డేట్ పోస్టర్‌లో రోషన్‌ ఏర్‌క్రాఫ్ట్‌ నుంచి దిగుతూ కనిపించాడు — ఓవర్‌కోట్‌, హ్యాట్‌తో మాస్‌, క్లాస్‌ లుక్ కలిపిన స్టైలిష్ లుక్‌తో చర్చనీయాంశంగా మారాడు.

ఈ స్పోర్ట్స్ డ్రామా చిత్రాన్ని ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నాడు. మలయాళ బ్యూటీ అనస్వారా రాజన్ ఈ సినిమా ద్వారా తెలుగు తెరపై అడుగుపెడుతోంది. ఫస్ట్ లుక్‌, గ్లింప్స్‌తోనే రోషన్‌ కొత్త లుక్‌కి ప్రేక్షకులలో మంచి క్యూరియాసిటీ పెరిగింది.

టెక్నికల్ వైపు కూడా సినిమా టాప్ లెవెల్‌లోనే ఉంది — ఆర్. మాధీ సినిమాటోగ్రఫీ, మిక్కీ జే మేయర్ మ్యూజిక్‌ అందిస్తున్నారు. ప్రస్తుతం సినిమా ఫైనల్ ఫేజ్‌లో షూట్ జరుపుకుంటోంది.

ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌ నెటిజన్లను కూడా మెప్పించింది. ఇందులో రోషన్‌ లుక్‌ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఈ మూవీ కోసం రోషన్‌ మేకోవర్‌ చాలా కొత్తగా ఉండటంతో ఈసారి భారీ హిట్‌ కొడతాడని నెటిజన్లు కూడా అభిప్రాయం చెందుతున్నారు.

, , , , ,
You may also like
Latest Posts from