సినిమాల్లో తన స్టైల్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసే సూపర్‌స్టార్ రజినీకాంత్, ఇప్పుడు ఆఫ్‌స్క్రీన్‌లో తన వినయంతో సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నారు. తాజాగా ఆయన నటించిన ‘కూలీ’ సినిమా రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించగా, దాని తర్వాత రజనీ తన వార్షిక హిమాలయ యాత్రకు బయలుదేరారు.

రిషికేశ్‌లో స్నేహితులతో కలిసి ఉన్న సమయంలో తీర్థయాత్రికులు తీసిన కొన్ని ఫొటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. వాటిలో రజనీ రోడ్డు పక్కన ఆకు మీద సాదా భోజనం చేస్తూ, ఆశ్రమంలో స్థానికులతో మాట్లాడుతున్న దృశ్యాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కామెంట్లు వరదలా వస్తున్నాయి — “ఇదే అసలైన సూపర్‌స్టార్!”, “రజనీ సింప్లిసిటీకి జై!” అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

స్పిరిట్యువల్ లైఫ్‌స్టైల్, సాధన, సౌమ్యత — ఇవే రజినీని ప్రత్యేకంగా నిలబెడుతున్న మూడు గుణాలు. ఆయన ప్రతి ఏడాది హిమాలయాలకు వెళ్లి ధ్యానం, ఆత్మసాధన చేస్తారు. ఈసారి రిషికేశ్ యాత్రతో మరోసారి అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు రజినీ!

, , , , ,
You may also like
Latest Posts from