
మలయాళ సినీ నటి లక్ష్మీ ఆర్ మీనన్ పై నమోదైన కిడ్నాప్, దాడి కేసులో కేరళ హైకోర్టు పెద్ద ఊరట ఇచ్చింది. ఆగస్టు 24న కొచ్చి పబ్‌లో జరిగిన వివాదానికి సంబంధించిన కేసులో ఆమెకు ముందస్తు బెయిల్ మంజూరైంది.
జస్టిస్ బెచు కురియన్ థామస్ నేతృత్వంలోని హైకోర్టు బెంచ్ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో లక్ష్మీతో పాటు మరో ఇద్దరు కూడా నిందితులుగా ఉన్నారు.
ఏం జరిగింది అంటే?
ఆ రాత్రి కొచ్చి పబ్ బయట లక్ష్మీ మీనన్ గ్యాంగ్ – ఒక ఐటీ ప్రొఫెషనల్ మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
బాధితుడి ఫిర్యాదు ప్రకారం, నటి మరియు ఆమె స్నేహితులు అతని కారును అడ్డగించి, బలవంతంగా తమ వాహనంలోకి ఎక్కించుకొని దాడి చేశారట!
దీని ఆధారంగా పోలీసులు BNS 2023 చట్టం ప్రకారం కిడ్నాప్, బెదిరింపు సెక్షన్లతో కేసు నమోదు చేశారు.
అయితే, ట్విస్ట్ ఏంటంటే…
తాజాగా బాధితుడు కోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తూ, వివాదం పరిష్కారమైందని తెలిపాడు.
దీంతో హైకోర్టు, “తీవ్ర ఆరోపణలు ఉన్నప్పటికీ, సమస్య ఇరువురి మధ్య పరిష్కారమైందని” పేర్కొంటూ ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
లక్ష్మీ మీనన్ తనపై ఉన్న ఆరోపణలను “అసత్యం, ప్రేరేపితమైనవి” అని ఖండించారు.
దర్యాప్తు కొనసాగుతుండగా, కోర్టు ఆమెను మరియు ఇతర నిందితులను అరెస్టు నుంచి తాత్కాలికంగా మినహాయించింది.
దాంతో, ప్రస్తుతం లక్ష్మీ ఆర్ మీనన్ అరెస్టు నుంచి బయటపడినట్లయింది!
ఫ్యాన్స్ మధ్య ఇప్పుడు ఒక్కటే చర్చ — “ఈ కేసులో అసలు నిజం ఏమిటి?”
