కుమార్ అబ్బవరం (కిరణ్ అబ్బవరం) డబ్బున్న చెడిపోయిన కుర్రాడు. తల్లి లేకపోవటంతో తండ్రి (సాయికుమార్) పూర్తి స్వేచ్ఛ ఇచ్చేస్తాడు. ఫలితం? బుక్స్‌కి దూరం, బాటిల్‌కి దగ్గర. చదువంటే విసుగు, జీవితం అంటే జల్సా!

“ఇలాగే కొనసాగితే పూర్తిగా పాడు అవుతాడు” అని గ్రహించిన తండ్రి, కుమార్‌ను కేరళలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీకి పంపేస్తాడు – డొనేషన్‌తో, ఆశతో.

కానీ బాబు లొకేషన్ మారినా,
లైఫ్‌స్టైల్ మాత్రం అదే. డ్రింక్స్, ఫ్రెండ్స్, ఫన్…
ఇంతలో ఒక రాత్రి, అతను బాగా తాగి స్పృహ తప్పిపోతాడు.

అప్పుడే ఎంట్రీ — మెర్సీ జాయ్ (యుక్తి తరేజా)
ఆ అమ్మాయి అతడిని కాపాడుతుంది.
ఆ క్షణంలోనే కుమార్ జీవితానికి “రీస్టార్ట్ బటన్” నొక్కినట్టవుతుంది.

ఆమె చేసిన సాయం, ఆ మృదుత్వం – కుమార్ గుండెల్లో ప్రేమగా మొలుస్తాయి. ముందు దూరంగా ఉన్నా, తర్వాత ఆమె కూడా మనసు మార్చుకుంటుంది. ఇద్దరి మధ్య ప్రేమ పుష్పిస్తోంది అని అనుకునే సరికి — కథ అకస్మాత్తుగా డార్క్ టర్న్ తీసుకుంటుంది.

మెర్సీకి ఉన్న ఒక మానసిక సమస్య బయటపడుతుంది. అది కేవలం ప్రాబ్లమ్ కాదు… కుమార్ జీవితాన్ని కదిలించే మైండ్ స్టార్మ్! ఆమెకు అరుదైన వ్యాధి పోస్ట్ ట్రామాటిక్ స్టెస్ డిజార్డర్ (PSTD) ఉందని తెలుస్తుంది. ఆ వ్యాధి కారణంగా సూసైడ్‌కు ప్రయత్నిస్తుంటుంది. దాంతో ఆమెతో లవ్‌కు బ్రేకప్ చెప్పాలని డిసైడ్ అవుతాడు. కానీ అదీ కష్టమవుతుంది.

ఆమె బాధ, అతని ప్రేమ, వాటి మధ్య మనిషి అవ్వాలనే కుమార్ ప్రయాణం — ఇదే కథ యొక్క హార్ట్‌బీట్‌. ఇక్కడినుంచి సినిమా లవ్‌స్టోరీ నుంచి ఫన్ తో కూడిన సైకాలజికల్ ఎమోషనల్ డ్రామాగా మారిపోతుంది. ఈ క్రమంలో కుమార్ ప్రేమ కథ ఏ తీరం చేరుతుంది. తాగుబోతు కుమార్ మారాడా లేక ఆమె మారిందా వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎనాలసిస్

కొత్త దర్శకుడు జైన్స్ నాని, తన తొలి సినిమా K-Rampలో సేఫ్ జోన్‌లో ఆడదామని ప్రయత్నం చేసాడు. కథా నిర్మాణం చూస్తే — కొత్తదనం లేదు, కాని “మాస్ + ఫన్ ఎలిమెంట్స్” కలిపి ఎంటర్‌టైన్‌మెంట్-ఓరియెంటెడ్ నారేటివ్ ని సెట్ చేయాలనుకున్నాడు. అయితే అది అనుకున్న స్దాయిలో వర్కవుట్ కాలేదు.

సినిమా రెండు విభిన్న టోన్లలో నడుస్తుంది.
ఫస్టాఫ్: మాస్ కామెడీ, బార్ హ్యూమర్, కాలేజ్ మస్తీ.
సెకండాఫ్: ఎమోషన్, సైకాలజికల్ ఎడ్జ్, మెలో-డ్రామా.

ఇక్కడ దర్శకుడు మొదటి భాగంలో ప్రేక్షకుడిని “చలాకీగా నవ్వించాలి” అనుకున్నాడు, కానీ రెండో భాగంలో హృదయం తాకాలి అని ప్రయత్నించాడు. ఇది స్క్రిప్ట్ పేసింగ్‌లో ఒక “టోన్ షిఫ్ట్” అవుతుంది — అయితే అది చాలా స్మూత్ గా జరగాలి. ఇక్కడ డైరక్టర్ అనుభవ లేమి అందుకు సహకరించలేదు.

దానికి తోడు ఫస్టాఫ్ లో సన్నివేశాల ప్రవాహం స్పష్టంగా “హీరో ఇమేజ్ బిల్డింగ్” కోసం రాసినట్టుంది. కిరణ్ అబ్బవరం బాడీ లాంగ్వేజ్, ఆ యాటిట్యూడ్ – ప్రతి ఫ్రేమ్‌లో మాస్ ఫీలింగ్ తెస్తుంది. కామెడీ సీక్వెన్స్‌లు – కొన్ని స్లాప్‌స్టిక్‌గా బాగా వర్కౌట్ అయ్యాయి, మరికొన్ని outdated, forcedగా అనిపిస్తాయి.

స్క్రీన్‌రైటింగ్ భాషలో దీనిని “momentum maintenance writing” అంటారు – కథ రాకపోయినా, సన్నివేశాలు audience attention నిలుపుతాయి. కానీ 45 నిమిషాల తర్వాత ఆ momentum కంటిన్యూ చ్సేత అలసట తెస్తుంది. అలాంటప్పుడే boredom పుడుతుంది. అదే ఈ సినిమాకు మేజర్ గా జరిగింది.

టెక్నికల్ గా..

సినిమాటోగ్రఫీ పెద్దగా ఆకట్టుకునేలా లేదు. కేరళలో కథ సెట్ చేసినప్పటికీ, ఆ బ్యాక్‌డ్రాప్‌ను ఎక్కడా సద్వినియోగం చేయలేదు. దాంతో విజువల్స్ చాలా సాదాసీదాగా, రొటీన్‌గా కనిపిస్తాయి. డైలాగులు కొన్నిచోట్ల బాగానే ఉన్నప్పటికీ, చాలా సార్లు ఓవర్‌ద్‌టాప్‌గా, ఆర్టిఫిషియల్‌గా అనిపిస్తాయి. ఎడిటింగ్ ఓకేలా ఉంది, ప్రొడక్షన్ డిజైన్ కూడా బేసిక్ లెవెల్‌లోనే ఉంది.

మొత్తానికి దర్శకుడు జైన్స్ నాని దృష్టి మొత్తం ఒక్క దానిపైనే నిలిచిపోయినట్టు అనిపిస్తుంది — అది ఏమిటంటే, హీరో కిరణ్ అబ్బవరం ఎంట్రీ, ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్‌ను హైలైట్ చేయడం.

ఫైనల్ గా ..

“K-Ramp” పూర్తిగా మసాలా ఎంటర్టైనర్, ఎక్కడికక్కడ ఓవర్‌ద్‌టాప్‌ ఎలిమెంట్స్‌తో నిండిపోయిన సినిమా. కథలో ఎమోషనల్ డెప్త్ దాదాపు కనిపించదు. సెకండాఫ్‌లో కొంత కామెడీ పాస్ అవుతున్నా, దానికి సపోర్ట్ చేసే కథ బలహీనంగా ఉండటం, హీరో సహా ఎక్కువ పాత్రలు ఓవర్ యాక్టింగ్ బోర్డర్ దాటిపోవడం వల్ల సినిమా మొత్తం చాలా లిమిటెడ్ ఆడియెన్స్‌కి మాత్రమే వర్కౌట్ అవుతుంది. కామెడీ కొంత రంజిస్తుంది కానీ కథ మాత్రం కన్విన్స్ చేయదు.

, , , , ,
You may also like
Latest Posts from