
సినిమాల నుండి కొంత గ్యాప్ తీసుకున్నా… సమంత క్రేజ్ మాత్రం ఒక్కశాతం కూడా తగ్గలేదు! తన ప్రతి మాట, ప్రతి పోస్టు ట్రెండింగ్ అవుతుంది. ఇప్పుడు కూడా ఆమె చెప్పిన ఓ హార్ట్ టచింగ్ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమంత తన పర్సనల్ లైఫ్‌లో ఎదుర్కొన్న బాధలు, ప్రజల తీరు గురించి గట్టిగా స్పందించారు. విడాకులు, అనారోగ్యం వంటి క్లిష్ట సమయంలో కొందరు చేసిన ప్రవర్తనపై ఆమె ఎమోషనల్ అయ్యారు.
“నా జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు చూశాను. ముఖ్యంగా నాగ చైతన్యతో విడిపోయినప్పుడు, మయోసైటిస్ బారిన పడినప్పుడు — కొందరు పైశాచిక ఆనందం పొందారు. నా భవిష్యత్తు గురించి తీర్పులు ఇచ్చారు. మొదట్లో చాలా బాధపడ్డాను. కానీ ఇప్పుడు అలాంటి వారిని పూర్తిగా పట్టించుకోవడం మానేశాను,” అని సమంత చెప్పారు.
ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అభిమానులు ఆమె ధైర్యాన్ని, మానసిక స్థైర్యాన్ని పొగుడుతూ, “సమంత నిజమైన ఫైటర్!” అంటూ మద్దతు తెలుపుతున్నారు.
ఆమె గ్యాప్‌లో కూడా ఫ్యాన్స్ ప్రేమ, మీడియా ఫోకస్ ఎప్పటికీ తగ్గలేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలిగిన సమంత, ఇప్పుడు రీఎంట్రీకి సిద్ధమవుతుండగా, ప్రతి అప్‌డేట్ హెడ్లైన్ అవుతోంది.
ప్రస్తుతం సమంత బాలీవుడ్‌లో ‘రక్త్ బ్రహ్మాండ్’ అనే సినిమాలో నటిస్తున్నారు. దర్శకులు రాజ్ & డీకే తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ జోరుగా కొనసాగుతోంది.
ఇక తెలుగులో నందిని రెడ్డి దర్శకత్వంలో ‘మా ఇంటి బంగారం’ అనే సినిమా చేయబోతున్నారు. వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఓ బేబీ’ సూపర్ హిట్ కావడంతో, ఈ కొత్త ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
