సినిమా గాసిప్స్సినిమా వార్తలు

డిజాస్టర్ మూవీకి సీక్వెల్ ఏంటి రాజా?

కొన్నిసార్లు టాలీవుడ్‌లో లాజిక్‌ సెలవు తీసుకుంటుంది! హిట్‌ సినిమాలకు సీక్వెల్‌ రావడం నార్మల్‌. కానీ డిజాస్టర్‌ సినిమాకి సీక్వెల్‌ ప్లాన్ చేస్తే? అదే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌.

“Republic 2?” సీరియస్ గానే?

2021లో విడుదలైన దేవాకట్టా–సాయిధరమ్‌ తేజ్ కాంబినేషన్‌ చిత్రం రిపబ్లిక్ చిత్రం బాక్స్ ఆఫీస్‌ దగ్గర తను మునిగి, అందరినీ ముంచేసింది. క్రిటిక్స్‌ ప్రైజ్‌, కంటెంట్‌ హైప్, OTTలో ఇంపాక్ట్… ఇవి అన్నీ ఉన్నా, థియేట్రికల్‌గా మాత్రం డిజాస్టర్ ఫిల్మే.

అయినా sequel ప్లాన్? ఎవరు ఆలోచించాడు ఇది! ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ మొదలైందట. తేజ్ కూడా రెడీ అంట. కానీ ప్రశ్నల వరద:

డిజాస్టర్‌కి సీక్వెల్ ఎందుకు?
కొత్త కథతో రావటంలో కష్టం ఏమిటి?
నిర్మాత‌లు సైన్ చేస్తారా?
ఓటీటీలో అమ్ముడవుతుందా?
బయ్యర్లు నమ్ముతారా?
ఇది ఏం గుడ్డి నమ్మకం రా బాబూ!

అందుకు కారణం .. తేజ, దేవకట్టా ఎమోషన్ బాండ్ అని తెలుస్తోంది. తేజ్ ప్రమాదం తర్వాత దేవాకట్టా ఇచ్చిన సపోర్ట్ తో కోలుకున్నారు. అందుకే తేజ్–దేవాకట్టా “Success or Failure doesn’t matter… let’s work again” మిషన్‌లో! కానీ భావోద్వేగం ఒక్కటే సినిమా విజయం ఇవ్వదు కదా?

ఇండస్ట్రీ ఏమంటుంది?
“దేవ కట్టా బ్రిలియెంట్… కానీ ప్లాఫ్ కు సీక్వెల్ ఎందుకు?”
“కొత్త కథ తీసుకుంటే బాగుండేది.”

Similar Posts